RTC Bus Accident: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా-many injured as rtc indra bus overturns in prakasam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rtc Bus Accident: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

RTC Bus Accident: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 12:15 PM IST

RTC Bus Accident: ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఎర్రగొండ పాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా
ఎర్రగొండ పాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా

RTC Bus Accident: ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు.

yearly horoscope entry point

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం - బోయలపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సు హైదరాబాద్‌ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ఒకరు మాత్రమే గాయపడినట్లు పోలీసులు చెప్పారు.

Whats_app_banner