Nagababu Vote Issue : రెండు ఓట్ల వివాదంలో నాగబాబు, ఏపీలో ఎలా ఓటు వేస్తారని వైసీపీ విమర్శలు-mangalagiri news in telugu janasena leader nagababu applied vote in ap ysrcp allegations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nagababu Vote Issue : రెండు ఓట్ల వివాదంలో నాగబాబు, ఏపీలో ఎలా ఓటు వేస్తారని వైసీపీ విమర్శలు

Nagababu Vote Issue : రెండు ఓట్ల వివాదంలో నాగబాబు, ఏపీలో ఎలా ఓటు వేస్తారని వైసీపీ విమర్శలు

Nagababu Vote Issue : జనసేన నేత నాగబాబు ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం వివాదాస్పదం అయింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా ఆయన ఏపీలో ఓటు దరఖాస్తు పెట్టారు. దీంతో వైసీపీ నేతలు రెండు చోట్ల ఓటు ఎలా వేస్తారని విమర్శలు చేస్తుంది.

నాగబాబు

Nagababu Vote Issue : ఏపీ, తెలంగాణ రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడంపై ఇటీవల వివాదాస్పదం అయింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓట్లను ఏపీలో తొలగించాలని ఈసీని కోరారు. ఈ మేరకు ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి జాబితాను సిద్ధం చేయమని తెలిపింది. అయితే తాజాగా జనసేన నేత నాగబాబు ఈ రెండు చోట్ల ఓటు వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇటీవల నాగబాబు కుంటుంబం ఖైరతాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని మంగళగిరిలో ఆయన ఓటు హక్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

రెండు ఓట్లపై వైసీపీ విమర్శలు

హైదరాబాద్ లో నాగబాబు ఓటు హక్కు కలిగి ఉండగా, మళ్లీ ఏపీలో అప్లై చేసుకోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నైతికత కాదని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇటీవల తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు మళ్లీ ఏపీలో ఎలా ఓటు వేస్తారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

బూత్ లెవల్ అధికారుల విచారణ

సాధారణంగా ఎన్నికల సంఘం ఒకే చోట ఓటు హక్కు కల్పిస్తుంది. ఎవరైనా తమ నివాస ప్రాంతం మారినప్పుడు ఓటు ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు. జనసేన నేత నాగబాబు తన ఓటును ఏపీకి బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గతంలో ఉన్న చోట ఓటు హక్కును తొలగించి, ప్రస్తుతం అప్లై చేసుకున్న ప్రాంతంలో ఓటు హక్కు కల్పి్స్తారు. మంగళగిరిలో నాగబాబు ఓటు అప్లై చేసుకోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఓటు వేసి, మళ్లీ ఏపీలో ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఏపీలో నాగబాబు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోగా, ఆయన ఇచ్చిన అడ్రస్ కు బూత్ లెవల్ ఆఫీసర్ విచారణకు వెళ్లారు. నాగబాబు దరఖాస్తులో ఉన్న అడ్రస్ కు అధికారులు వెళ్లగా ఆ ఇంటికి తాళం వేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో బూత్ లెవల్ అధికారులు పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. నాగబాబును తమ ముందు హాజరు కావాలని కోరారు.

ఈ వివాదంపై స్పందించిన నాగబాబు తెలంగాణ ఎన్నికల్లో తాను ఓటు వేయలేదని తెలిపారు. తాను తెంలగాణలో ఓటు వేసినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తల్లో స్ఫూర్తి నింపేందుకు తన ఓటును ఏపీకి బదిలీ చేసుకునేందుకు అప్లై చేసుకున్నానన్నారు.