AIIMS Mangalagiri Recruitment 2024 : మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు - దరఖాస్తులకు డిసెంబర్ 8 చివరి తేదీ
AIIMS Mangalagiri Recruitment 2024: మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. మొత్తం ఐదు ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
మంగళగిరి ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలకు డిసెంబర్ 8 ఆఖరు తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 13న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని టెలి మానస్ ప్రాజెక్టు నడుస్తోంది. ఈ ప్రాజెక్టుకు మానవ వనరులను నియమించుకునేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫశ్రీసర్, సీనియర్ రెసిడెంట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఈ నియామకం కేవలం 11 నెలల ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిసెంబర్ 8 సాయంత్రం 5 గంటల లోపు దాఖాలు చేయాలి. దరఖాస్తు దాఖలు చేసిన అభ్యర్థులు డిసెంబర్ 13న మంగళగిరి ఎయిమ్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
భర్తీ చేసే పోస్టులు…
1. అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్- 1
2. సీనియర్ రెసిడెంట్/ కన్సల్టెంట్-1
3. సైకియాట్రిక్ సోషల్ వర్కర్- 1
4. టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్-1
5. డేటా ఎంట్రీ ఆపరేటర్-1
విద్యా అర్హతలు…
1. అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు సైకియాట్రీలో పోస్టు గ్రాడ్యూషన్ పూర్తి చేసి, మూడేళ్లు అనుభవం.
2. సీనియర్ రెసిడెంట్/ కన్సల్టెంట్ పోస్టుకు సైకియాట్రీలో గ్రాడ్యూషన్ .
3. క్లీనికల్ సైకాలిజిస్టు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పోస్టుకు సైకాలజీలో ఎంఏ, ఎంఎస్సీలో ఫస్ట్ ఆర్ సెకెండ్ క్లాస్, ఎంఫీల్ సైకాలజీ చేయాలి.
4. టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పోస్టుకు బీఈ, డిప్లొమా ఇంజినీరింగ్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
5. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్
నెలవారీ జీతం…
1. అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్- రూ.1,50,000
2. సీనియర్ రెసిడెంట్/ కన్సల్టెంట్- రూ.1,00,000
3. సైకియాట్రిక్ సోషల్ వర్కర్- రూ.50,000
4. టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్- రూ.35,000
5. డేటా ఎంట్రీ ఆపరేటర్- రూ.25,000
వయో పరిమితి అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్ 50 ఏళ్లు కాగా, మిగిలిన సీనియర్ రెసిడెంట్/ కన్సల్టెంట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 45 ఏళ్లు నిర్ణయించారు.
దరఖాస్తు ఎలా చేయాలి
దరఖాస్తును డిసెంబర్ 8 సాయంత్రం 5 గంటల లోపు గూగుల్ ఫారం ద్వారా ఆన్‌లైన్‌లో చేయాలి. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.aiimsmangalagiri.edu.in/wp-content/uploads/2024/11/Tele-MANAS-Recruitment-Notification.pdf లో గూగూల్ ఫారం లింక్ ఉంటుంది. అలాగే నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ఉంటాయి. దరఖాస్తును పూర్తి చేసి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డిసెంబర్ 13న వాక్ -ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు మంగళగిరి ఎయిమ్స్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద ఉదయం 8 గంటలకు తమ ఒరిజనల్ ధ్రువీకరణ త్రాలను సెల్ఫ్ అటెస్ట్ చేసిన కాపీలతో హాజరుకావాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం