Manda Krishna On CBN: మార్గదర్శకాలు వచ్చే వరకు ఉద్యోగాల భర్తీ చేయొద్దు.. జీవోలు జారీ చేశాకే ముందుకెళ్లాలన్న మందకృష్ణ-manda krishna demands dont fill up the jobs until the guidelines are issued ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Manda Krishna On Cbn: మార్గదర్శకాలు వచ్చే వరకు ఉద్యోగాల భర్తీ చేయొద్దు.. జీవోలు జారీ చేశాకే ముందుకెళ్లాలన్న మందకృష్ణ

Manda Krishna On CBN: మార్గదర్శకాలు వచ్చే వరకు ఉద్యోగాల భర్తీ చేయొద్దు.. జీవోలు జారీ చేశాకే ముందుకెళ్లాలన్న మందకృష్ణ

Sarath chandra.B HT Telugu
Published Aug 01, 2024 01:19 PM IST

Manda Krishna On CBN: 30ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా ఉత్తర్వులు జారీ చేసి ఉండకపోతే సుప్రీం కోర్టులో చారిత్రక తీర్పు వెలువడి ఉండేది కాదని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ ఢిల్లీలో అన్నారు.

సుప్రీం కోర్టులో మందకృష్ణ మాదిగ
సుప్రీం కోర్టులో మందకృష్ణ మాదిగ

Manda Krishna On CBN: ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు 30ఏళ్ల పోరాట ఫలితమని ఢిల్లీలో మందకృష్ణ మాదిగ చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత న్యాయస్థానంలో మందకృష్ణ రాజ్యాంగధర్మాసనానికి కృతజ్ఞతలు చెప్పారు.

అన్యాయం జరిగిన వర్గాల పక్షాన న్యాయం నిలబడుతుందని సీజేఐ ధర్మాసనం నిరూపించిందని మందకృష్ణ చెప్పారు. న్యాయమూర్తులు అందరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రక్రియను ముందుకు నడిపించిన మోదీ,అమిత్‌ షా, గతంలో వెంకయ్యనాయుడు సహకరించారన్నారు.

గతంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ చేసిందని, తీర్పు వచ్చే సమయానికి ఆయనే సీఎంగా ఉన్నారని, ఆయన వర్గీకరణ చేయకపోతే తమకు వేలాది ఉద్యోగాలు వచ్చేవి కాదని, ఆయన వర్గీకరణ చేయడం వల్లే 30ఏళ్ల ఉద్యమం నిలబడిందన్నారు. తమకు అండదండలు అందించిన ప్రతి సామాజిక వర్గానికి కృతజ్ఞతలు చెప్పారు.

ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు చేశారని, ఇప్పుడు కూడా ఆయనే సిఎంగా ఉన్నారని, మాదిగలు ఆయనకు సహకరించారని, వర్గీకరణ తీర్పు వెలువడే సమయంలో ఆయన స్థానంలో మరొకరు ఉంటే వర్గీకరణ చేయకుండా అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉంటాయని, చంద్రబాబు వర్గీకరణ చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అందుకున్న కులాలకే రిజర్వేషన్లు అందాయని, అందుకోలేని వర్గాలకు, కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. అంబేడ్కర్‌ కల్పించిన రిజర్వేషన్లను ముందుకు నడిపించే విషయంలో ఎమ్మార్పీఎస్ ముందుటుందన్నారు.

తమ ఉద్యమం వేగవంతం కావడానికి చాలామంది మద్దతిచ్చారని, నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారని, గతంలో చంద్రబాబు ఉన్నపుడే వర్గీకరణ చేశారని, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండగానే సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందన్నారు. వర్గీకరణ ప్రక్రియలు చేసే వరకు, ఏపీ, తెలంగాణల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదని, మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే భర్తీ చేయాలన్నారు. అవసరమైతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని అప్పటి వరకు నియామక ప్రక్రియ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner