Anantapuram Crime: అనంతపురంలో ఘోరం, డబ్బులివ్వలేదని మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
Anantapuram Crime: అనంతపురంలో దారుణం జరిగింది.డబ్బులివ్వలేదని సహజీవనం చేస్తున్న మహిళపై వ్యక్తే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వెలుగు చూసింది.
Anantapuram Crime: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం సహజీవనం చేసే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక దుర్మార్గుడు.
డ్వాక్రా సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న మహిళపై తన తమ్ముడితో కలిసి ఆ వ్యక్తి దాడి చేశాడు. పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో 60 శాతం కాలిపోయిన ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ వాంగ్మూలాన్ని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దారుణ ఘటన మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో జరిగింది. పార్వతి, మోహన్ అనే వ్యక్తితో సహజీనం చేస్తుండేది. మహిళకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె పేరిట బ్యాంక్‌లో రూ.2 లక్షల డిపాజిట్ ఉండింది. కుమార్తె పేరు మీద బ్యాంక్‌లో రూ.2 లక్షలు ఉందని మోహన్ తెలిసింది. అయితే తనకు ఆ రెండు లక్షల రూపాయాలు కావాలని కుమార్తెను తీసుకెళ్లిపోయాడు.
రెండు లక్షల రూపాయాలు ఇస్తేనే, కుమార్తెను ఇస్తానని పార్వతికి చెప్పాడు మోహన్. అయితే అందుకు పార్వతి తాను రెండు లక్షల రూపాయాలు ఇస్తానని, ఆ తరువాత తమ జోళికి రావద్దని అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సమస్యపై గత కొంతకాలంగా పార్వతి, మోహన్ మధ్య తగాద జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం డ్వాక్రా సమావేశానికి పార్వతి వెళ్తుంది.
ఈ సమయంలో మోహన్, ఆయన సోదరుడు సిద్ధులు కలిసి పార్వతిపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న పెట్రోల్‌ని పార్వతిపై పోసి నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు గుర్తించి కాలిపోతున్న ఆమె దగ్గరకు హుటాహుటినా అక్కడకు చేరుకుని మంటలు ఆపారు. వెంటనే చికిత్స నిమిత్తం పార్వతిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరిశీలించిన 60 శాతం కాలిపోయిందని తెలిపారు. ఆమెకు చికిత్స అందించారు. ఈ విషయం రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జికి తెలిసింది. వెంటనే జడ్జి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పార్వతి వాగ్మూలం నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. శ్రీనివాసులు తెలిపారు. అలాగే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)