Visakha Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
Visakha Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోకెన్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Visakha Fire Accident: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి ప్లాంటును చుట్టుముట్టాయి.
ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించడంతో చుట్టు పక్కల పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. అగ్ని ప్రమాదంతో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ప్రమాదంలో సిబ్బంది సురక్షితంగా బయట పడినట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో పరవాడ ఫార్మాసిటీలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరిగింది. భారీ ప్రమాదాలతో దీంతో కార్మికులతో పాటు చుట్టుపక్కల నివాసముంటోన్న స్థానికులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 22వ తేదీల్లో కూడా ఫార్మాసిటీలోఅగ్ని ప్రమాదాలు జరిగాయి. నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.