BC Welfare Schools: మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
BC Welfare Schools: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 6,7,9,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు.

BC Welfare Schools: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తోన్న పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
2025-26 విద్యా సంవత్సరంలో 5వ(5th class) తరగతితో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6,7, 8,9 తరగతుల్లో మిగిలిన ఉన్న సీట్లను కూడా బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీలో చేపడతారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న మహాత్మ జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ (first Inter) ఇయర్ అడ్మిషన్లు కల్పిస్తారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అర్హులైన విద్యార్ధులు 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం బీసీ వెల్ఫేర్ సంస్థ వెబ్‌సైట్ https://mjpapbcwreis.apcfss.in/ లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయాలనుకునే విద్యార్ధులు సమీపంలోని ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని జిల్లా సమన్వయకర్తల్ని సంప్రదించాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీలు...
5వ తరగతిలో ప్రవేశం కోసం ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఏప్రిల్ 27వ తేదీ ఉదయం పది గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15వ రకు స్వీకరిస్తారు.
జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం పది గంటల నుంచి 12.30వరకు పరీక్ష నిర్వహిస్తారు.దరఖాస్తులను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 15వరకు స్వీకరిస్తారు.
6,7,8,9 తరగతుల్లో మిగిలి ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన బాలబాలికలు ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారాన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి… బీసీ వెల్ఫేర్ సంస్థ వెబ్‌సైట్ https://mjpapbcwreis.apcfss.in/