Instagram Love : వివాహిత ఇన్ స్టాగ్రామ్ ప్రేమ, భార్య ముందే ప్రియుడికి దేహశుద్ధి చేసిన భర్త
Instagram Love : ఇన్ స్టా గ్రామ్ లవ్ పచ్చని కాపురంలో చిచ్టుపెట్టింది. పెళ్లై పిల్లలున్న ఓ వివాహిత... ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ తో పరిచయం పెంచుకుంది. వీరి మధ్య ప్రేమ చిగురించింది. భార్య తీరుతో అనుమానం వచ్చిన భర్త... ఆమె ప్రియుడితో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశాడు.
సోషల్ మీడియాలో విస్తృత పోకడలు పచ్చిన కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివాహిత ఇన్ స్టాగ్రామ్ ప్రేమ కాపురంలో చిచ్చుపెట్టింది. భార్య, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త... భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. ఈ ఘటన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్రశేఖర్ కు.. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టిన భర్త...ఆమెకు బుద్ధి చెప్పాలనుకుని ప్రియుడితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ పట్టుకుని దేహశుద్ధి చేశాడు.
మదనపల్లెకు చెందిన యువతి కొన్నాళ్ల క్రితం ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి పిల్లలు కూడా పుట్టారు. ఇన్‌స్టా గ్రామ్ లో పరిచయమైన ఇంజినీరింగ్ యువకుడు ఇంద్రశేఖర్, వివాహితకు మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కలుసుకుంటున్నారని తెలుసుకుని భర్త తన స్నేహితులతో వచ్చి దాడి చేశాడు. ఈ దాడిలో ఆ ప్రేమికుడు తన్నులు తిన్నాడు. అయితే తన భార్యను మాత్రం భర్త ఏమనలేకపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన ఇంద్రశేఖర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది కత్తిపోట్లు
కడప జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడంలేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేయాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. కడప జిల్లాలోని వేముల మండలం కొత్తపల్లి చెందిన షర్మిలను కుల్లాయప్ప అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం యువతి ఇంట్లో ఒంటరిగా ఉందనే విషయం తెలుసుకున్న కుల్లాయప్ప కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడిచేశాడు.
14 కత్తిపోట్లు
యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి రావడంతో... వారిని చూసి కుల్లాయప్ప పారిపోయాడు. అయితే అప్పటికే తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. యువతి పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యువతి రక్తం ఎక్కువగా కోల్పోవడంతో... అపస్మారక స్థితిలోకి చేరింది. దీంతో మెరుగైన వైద్యం కోసం యువతిని కడప రిమ్స్ కు తరలించారు. షర్మిల తండ్రి స్థానికంగా వీఆర్ఏగా పనిచేస్తున్నారు. ఆయన రెవెన్యూ సభలు కోసం శనివారం గొందిపల్లెకు వెళ్లారు. షర్మిల తల్లి కూలి పనికి వెళ్లడంతో ఇంట్లో షర్మిల ఒక్కరే ఉన్నారు. యువతి ఒక్కతే ఉన్న విషయాన్ని తెలుసుకున్న ప్రేమోన్మాది...ఇంట్లోకి వెళ్లి షర్మిలపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం