AP Rains Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు-low pressure strengthening in bay of bengal heavy rains in coastal districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

AP Rains Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 30, 2024 09:14 AM IST

AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు,ఎల్లుండి అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి.

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

AP Rains Update: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుండటంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలపై అత్యవసర సహాయం కోసం విపత్తుల సంస్థలోని టోల్ ప్రీ 1070, 112, 18004250101 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

రానున్న నాలుగు రోజుల్లో ఏపీ వాతావరణం..

30 ఆగష్టు, శుక్రవారం :

• అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

31 ఆగష్టు, శనివారం :

• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

01 సెప్టెంబర్, ఆదివారం:

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

02 సెప్టెంబర్, సోమవారం:

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.