Weather Updates : 14న బంగాళాఖాతంలో అల్పపీడనం! ఏపీకి వర్ష సూచన
AP Weather Updates : నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14న అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. దీంతో పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది.
Weather News: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం అనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో నవంబరు 16 కల్లా వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది.
అల్పపీడన ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన, తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఇక తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదు. పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరిలో వానలు పడే అవకాశం ఉంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కొంత చలి తీవ్రత తగ్గగా…. వేడి వాతావరణం ఉన్నట్లు అనిపిస్తుంది. గాలుల వల్ల ఉక్కపోతగా పెరిగింది. కోస్తా, తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో తేమ వాతావరణం ఉంది. ఆ ప్రాంతాల్లో కొంత వేడి తక్కువగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో వేడిగానే ఉంటుంది.