AP Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, కృష్ణా బేసిన్‌లో కొనసాగుతున్న వరద
AP Weather Updates: బంగాళాఖాతంలో గురువారం ఏర్పడే అల్పపీడనంతో ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన ఉందని విశాఖపట్నం వాదావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. రానున్న మూడ్రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
AP Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. గురువారం ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా మొదలుకుని రాయలసీమ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనంతో గురువారం అల్పపీడనంగా మారుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం శుక్ర, శనివారాల్లో పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని,గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అల్పపీడనం నేపథ్యంలో బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబరులో సాధారణంగా అల్పపీడనాలు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం…
కృష్ణా బేసిన్‌లో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర‌్షాలకు కృష్ణానదిలో ఉన్న చిట్టచివరి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో బుధవారం కూడా వరద కొనసాగుతోంది. పులిచింతల నుంచి దిగువకు 2లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 16,538 క్యూసెక్కులు వదిలారు. ఉదయం 9 గంటల నుంచి క్రమేపీ పెరుగుదల కనిపిం చింది. కృష్ణా డెల్టా లోని పంట కాల్వలకు 17,020 క్యూసెక్కులు ఇస్తు న్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 9,116, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 7,508, గుంటూరు ఛానల్కు 96 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్న క్రమంలో.... పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ప్రవాహం మరింత పెరిగింది. బ్యారేజీ ఎగువున 64,039 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. పులి చింతల (వజినేపల్లి) నుంచి 58,412 క్యూసెక్కులు, పాలేరు నుంచి 02. మునేరు (కేసర) నుంచి 1,936. 1.755, కేఈబీ కాల్వకు 1620, ఏలూరు కాల్వకు 1,511 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నాడు ఎగువ నుంచి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ నుంచి రైవస్ కాల్వకు 4,521 బందరు కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఎగువ నుంచి నీటి ప్రవాహం మరింత పెరుగనుంది.