AP Mega DSC Update: లీగల్ ఇష్యూస్ కొలిక్కి వచ్చాకే మెగా డిఎస్సీ, వచ్చే ఏడాదికి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న లోకేష్‌-lokeshs announcement in the assembly mega dsc notification only after the legal issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mega Dsc Update: లీగల్ ఇష్యూస్ కొలిక్కి వచ్చాకే మెగా డిఎస్సీ, వచ్చే ఏడాదికి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న లోకేష్‌

AP Mega DSC Update: లీగల్ ఇష్యూస్ కొలిక్కి వచ్చాకే మెగా డిఎస్సీ, వచ్చే ఏడాదికి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న లోకేష్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 13, 2024 12:26 PM IST

AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నిర్వహణపై మంత్రి నారాలోకేష్‌ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. న్యాయపరమైన అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరిస్తామన్నారు. వచ్చే ఏడాదికి ఉద్యోగాలు భర్తీ సహా డిఎస్సీ 98లో మిగిలిన ఖాళీలను పూర్తి చేస్తామన్నారు.

డిఎస్సీ నోటిఫికేషన్‌పై నారా లోకేష్ కీలక ప్రకటన
డిఎస్సీ నోటిఫికేషన్‌పై నారా లోకేష్ కీలక ప్రకటన (wikipedia)

AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటఫికేషన్‌పై మంత్రి నారాలోకేష్‌ స్పష్టత ఇచ్చారు.న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.

16347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ మొదటి వారంలోనే వెలువరించాల్సి ఉంది. నోటివఫికేషన్ వెలువడటానికి ముందు రిజర్వేషన్ల అమలుపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిఎస్సీ నోటిఫికేషన్‌ నిలిచిపోయింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని నారా లోకేష్‌ సభలో ప్రకటించారు.

అందరికి అమోదయోగ్యంగా, లీగల్ లిటిగేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని, పెండింగ్ ఖాళీలు సహా అన్ని ఉద్యోగాలను వచ్చే ఏడాది నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సభలో లోకేష్‌ స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీచేయలేదని గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి ప్రజలు 93శాతం సీట్లు ఇచ్చారని నిరుద్యోగులంతా మనవైపు ఆశగా ఎదురుచూస్తున్నారని, ముఖ్యమంత్రి నన్ను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నియమించారని ఇచ్చిన హామీ మేరకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు.

గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

గత జనవరిలో వైసీపీ ప్రభుత్వం 6100పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి దాని స్థానంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారైన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

డిఎస్సీ 1998 ఉద్యోగాలు…

డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు తనను కలిశారని, . 1998 డిఎస్సీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీచేశారని ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది, ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారని పరిశీలించి న్యాయం చేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.

1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... ఎంటిఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఉండవు. వారికి రిటైర్ మెంట్ వయసు 60సంవత్సరాలుగా పేర్కొన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

గతంలో టిడిపి ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యను బాధ్యతగానే చేపట్టిందని, గతంలో టిడిపి ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నపుడు 11 డిఎస్సీలు నిర్వహించి 1.5లక్షల టీచర్ పోస్టులు భర్తీచేశామని నారా లోకేష్ చెప్పారు. అందులో 9 డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే పెట్టారని అభ్యర్థుల విన్నపాలతో తొలుత టెట్ నిర్వహించామన్నారు.

రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తిచేస్తాం!

గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి అయిదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని నారా లోకేష్‌ ఆరోపించారు. రాజకీయంగా మాకు మంచిపేరు వస్తుందని స్థలాన్ని మార్చారని 2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తిచేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

విభజనచట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న విద్యాసంస్థలపై శాసనసభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... 2014-19 మధ్య చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారని, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరు విండ్ టర్భయిన్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, సెల్ ఫోన్, ఉభయగోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్ర ఐటి, మెడికల్ డివైస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారు.

విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని ఐఐటి తిరుపతికి , ఐఐఎం విశాఖకి, ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు, ట్రిపుల్ ఐటి కర్నూలుకు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి కేటాయించారని అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదన్నారు. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదు. ఐఐటి తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారని ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాలు భూములు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్ కు 255 ఎకరాలు, ట్రిపుల్ ఐటిలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారని లోకేష‌‌ సభలో వివరించారు.

యుద్ధప్రాతిపదికన భూములు కేటాయించడమేగాక, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పనుల పురోగతిని ఆనాడు ప్రతినెలా ముఖ్యమంత్రి సమీక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పనులను పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేశారు. ఆయా విద్యాసంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషిచేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Whats_app_banner