Teacher transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు… వివాదాల్లేకుండా సీనియార్టీ లిస్ట్‌ తయారు చేయాలన్న లోకేష్‌-lokesh wants to prepare teachers seniority list without controversy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Teacher Transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు… వివాదాల్లేకుండా సీనియార్టీ లిస్ట్‌ తయారు చేయాలన్న లోకేష్‌

Teacher transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు… వివాదాల్లేకుండా సీనియార్టీ లిస్ట్‌ తయారు చేయాలన్న లోకేష్‌

Sarath Chandra.B HT Telugu
Published Feb 19, 2025 06:07 AM IST

Teacher transfers: వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. జీవో నెం.42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర పన్నారని పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్షలో నారా లోకేష్ ఆరోపించారు.

విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్
విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్

Teacher transfers: ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై తర్వలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డీఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా సమావేశంలో కూలంకుషంగా చర్చించారు.

జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపు

జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నూతన సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జూనియర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

జీవో 42 ద్వారా 80 కాలేజీలు మూత

జీవో 42 ద్వారా జరిగిన విధ్వంసంపై సమావేశంలో చర్చించారు. జగన్ రెడ్డి అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 42 ద్వారా 80 ఎయిడెడ్ కాలేజీలు మూతపడ్డాయని జీవో జారీకి ముందు 137 కాలేజీలు ఉండగా.. అనంతరం 57కి తగ్గాయన్నారు. దీనివల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారని. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని, అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి ఆదేశించారు.

నైపుణ్య గణన కార్యక్రమంపైనా సమావేశంలో చర్చించారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు. స్కిల్ సెన్సెస్ ను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానించాలని సూచించారు. యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా ఉపాధి కల్పనా అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సీడ్ యాప్ పరిధిలో ఉన్న జిల్లా మేనేజర్ విధులను సమగ్రంగా పరిశీలించి ఏకీకృత వ్యవస్థ తీసుకురావాలని ఆదేశించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం