AP Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు..!-light to moderate rains in andhrapradesh over low pressure in bay of bengal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Light To Moderate Rains In Andhrapradesh Over Low Pressure In Bay Of Bengal

AP Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు..!

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 07:21 AM IST

low pressure in bay of bengal: ఇప్పటికే ఏపీలోని ప‌లు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో అల్పపీడనం ముప్పు రానుంది. ఫలితంగా పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

Rain Alert to Andhrapradesh: దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటున సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద ఇవాళ(నవంబర్ 16 అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా నవంబర్ 18వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

కొద్దిరోజులుగా చూస్తే ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కొన్ని రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విపరీతంగా వానలు పడుతున్నాయి. శనివారం ముందు వరకు మూడు రోజుల పాటు సాధారణ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. ఆ తర్వాత నుంచి వర్షం పెరిగింది. నెల్లూరు జిల్లాలోని కావలి(Kavali), కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో వర్షం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడుతుండటంతో... ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

తెలంగాణలో చూస్తే వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిది. ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది, ఈశాన్యం దిశల నుంచి గాలు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది.

IPL_Entry_Point