AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!
AP Telangana Weather Updates : ఏపీకి మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన ఇచ్చింది. పలుచోట్ల ఇవాళ తేలికపాటి లేదా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు తాజా వెదర్ బులెటిన్ ను విడుదల చేసింది.

ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
రాయలసీమలో చూస్తే కొన్నిచోట్ల ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
తెలంగాణలో పొడి వాతావరణం..!
రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరో వారం రోజులపాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వివరించింది.
హైదరాబాద్ నగరంలో చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశలో గంటకు 04- 08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
కొద్దిరోజులుగా తెలంగాణలో చలి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది. ఉత్తర తెలంగాణతో పోల్చితే.. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొంతమేర చలి తీవ్రత ఎక్కువగా ఉంది.
సంబంధిత కథనం