తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంది. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా… మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం… ఇవాళ(జూన్ 04)నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ,సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(జూన్ 5) నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైగరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జూన్ 6 నుంచి జూన్ 10వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవు. మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడొచ్చు. లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లుల పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు 8 -12 కి.మీ వేగంతో వీచే అకాశం ఉంది.
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కోస్తా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా పలుచోట్ల జల్లులు పడే అవకాశం ఉంది.