AP TG Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం..!-light rain likely in ap today and tomorrow imd latest weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం..!

AP TG Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 27, 2024 02:27 PM IST

AP Telangana Weather Updates : పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.

ఏపీకి తేలికపాటి వర్ష సూచన
ఏపీకి తేలికపాటి వర్ష సూచన

నైరుతి మరియు దానిని అనుకుని ఉన్న పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. అయితే ప్రసుతం ఇది బలహీనపడినట్లు పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

ఈ ప్రభావంతో ఇవాళ ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ కోస్తాలో చూస్తే... ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు.

రాయలసీమ జిల్లాలో చూస్తే... ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

తెలంగాణలో పొడి వాతావరణం…

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మేరకు తాజా బులెటిన్ ను విడుదల చేసింది.

ఇక రేపట్నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇదే మాదిరి వాతావరణం ఉంటుందని వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

Whats_app_banner