YCP MLC Duvvada: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ముందు అర్థరాత్రి హైడ్రామా, ఇంటి ముందు కుమార్తెల నిరీక్షణ
YCP MLC Duvvada: వైసీపీ మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. ఇంట్లోకి వస్తామంటూ దువ్వాడ ఇంటి వద్ద కుమార్తెలు నిరీక్షించడం చర్చనీయాంశంగా మారింది.
YCP MLC Duvvada: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్థరాత్రి హైడ్రామో నెలకొంది. దువ్వాడ కొత్తగా నిర్మించిన ఇంటి ముందు ఆయన కుమార్తెలు దువ్వాడ హైందవి, మరో కుమార్తె నిరీక్షించడం చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామంలో జాతీయ రహదారిపై దువ్వాడ ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. దువ్వాడ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు ఆయన కుమార్తెలు ప్రయత్నించారు.
గురువారం సాయంత్రం 3.30 గంటలకు దువ్వాడ కుమార్తెలు అక్కడకు చేరుకున్నా వారిని లోనికి రానివ్వలేదు. దీంతో వారు ఇంటి బయటే నిరీక్షించారు. దువ్వాడతో కొంత కాలంగా ఆయన సతీమణికి విభేదాలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా దువ్వాడ సతీమణి చివరి నిమిషం వరకు పోటీలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.
వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో కొంత కాలంగా విభేదాలు నెలకొన్నాయి. మరో మహిళతో సంబంధం నేపథ్యంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విభేదాలు తలెత్తాయి. దీంతో భార్యా కుమార్తెలు విడిగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ఇవి మరింత ముదిరాయి. దువ్వాడకు టిక్కెట్ ఇవ్వడాన్ని ఆయన సతీమణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇది తీవ్ర దుమారం రేపింది. ఎన్నికల సమయంలో కూడా వారు అంటిముట్టనట్టే వ్యహరించారు.
ఇటీవల కొత్త ఇంటిని నిర్మించిన దువ్వాడం అందులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఇంటికి చేరుకున్న కుమార్తెలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తలుపులు తెరవలేదు. శ్రీనివాస్ తలుపులు తెరవక పోవడంతో వారు ఇంటి బయటే కారులోనే నిరీక్షించారు. తాము తండ్రితో కలిసి ఉంటామని, ఈ విషయాన్ని అడిగేందుకు ఆయనకు ఫోన్లు చేశారు. దువ్వాడకు మెసేజీలు కూడా పంపారు.
కుమార్తెలు వచ్చిన సమయంలో దువ్వాడ ఇంట్లో ఉన్నారా లేరా అనేది స్పష్టం కాలేదు. అర్థరాత్రి వరకు ఆయన కుమార్తెలు ఇంటి ముందే నిరీక్షించారు. తండ్రి నుంచి సమాచారం వచ్చే వరకు అక్కడే నిరీక్షిస్తామని స్పష్టం చేశారు. దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిలో లైట్లు వెలుగుతూనే ఉండటంతో లోపల మనుషులు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం