Tirupati Lands: తిరుపతిలో భూ కేటాయింపులు రద్దు, దేశ వ్యాప్తంగా వెంకన్న ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు
Tirupati Lands: తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టుల పేరిట చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు.
Tirupati Lands: తిరుపతిలో ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్‌కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి భూ కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు.దేశంలోని ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. దీని కోసం .అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తామన్నారు.
వేంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడటానికి ఒకడుగు ముందుకేయాలని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించ వద్దని దేశం, ప్రపంచలో వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకున్నామన్నారు. టీటీడీలో పని చేసేవారు హిందువులై ఉండాలని ...ఇతర మతస్తులను గౌరవ ప్రదంగా మరోచోట అవకాశం కల్పిస్తామన్నారు.
క్రిస్టియన్, ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్తుల ఉండరని ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారని దేశంలోని అన్ని రాజధానుల్లో వేంకటేశ్వరస్వామిని దేవాలయం నిర్మించాలని సంకల్పించామన్నారు. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామని ప్రపంచ దేశాల్లో హిందువుల ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నామని చెప్పిన బాబు ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నామన్నారు.
తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని , ఇప్పటికి విరాళాల ద్వారా రూ.2,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటైందన్నారు. అన్నదానం ఒక మహత్తర కార్యక్రమమని ఇది శాశ్వతంగా జరుగుతుందన్నారు. తాను ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించాని మానవ సేవ మాధవ సేవ రెండూ ఉంటాయని ప్రాణదానం తీసుకొచ్చామన్నారు.
తిరుమలలో ఏడు కొండలు వేంకటేశ్వరస్వామి సొంతమని ఇక్కడ అపవిత్రం చేయడం, వ్యాపారాలు జరగకూడదన్నారు. గతంలో అసెంబ్లీలో ఏడుకొండలు కాదు 5 కొండలు అని వ్యాఖ్యానించినప్పుడు పోరాడామని ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకు వస్తున్న సమయంలో నాపై 24 క్లేమోర్‌మైన్స్ పేల్చారని అన్ని క్లేమోర్స్ పేల్చినప్పుడు నేను ప్రాణాలతో బతికేవాడిని కాదని ..సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఇందులో వేంకటేశ్వరస్వామి మహిమ ఏంటో ఆలోచించుకోవాలి. 24 క్లేమోర్ పేలితే ప్రాణాలతో తప్పించుకోలేరు. వేంకటేశ్వరస్వామి మహిమ వల్లే బతికానని చెప్పారు.
సంబంధిత కథనం