IAS Imtiaz Ahmed : సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ వీఆర్ఎస్-త్వరలో వైసీపీలోకి, కర్నూలు నుంచి పోటీ?
IAS Imtiaz Ahmed : సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లై చేసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో ఆయన వైసీపీలో చేరునున్నారు.
IAS Imtiaz Ahmed : సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్(Imtiaz Ahmed) స్వచ్ఛంద పదవీవిరమణకు(VRS) దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందజేశారు. ఆయన ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తు్న్నారు. ఇంతియాజ్ వైసీపీలో(Ysrcp) చేరుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అభ్యర్థిగా ఇంతియాజ్ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఇంతియాజ్ వీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వీఆర్ఎస్ కు ఆమోదం
ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణకు రాష్ట్ర ప్రమాదం ఆమోదం తెలిపింది. బుధవారం ఉదయం ఇంతియాజ్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయగా.. కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు తెలిసింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే(Kurnool MLA Candidate) అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేయనున్నట్లు కీలక సమాచారం. రాజకీయాల్లో ఎంట్రీ కోసం తన సర్వీసులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి?
ఇంతియాజ్ సొంత జిల్లా కర్నూలు. ఆయన గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తుంది. ఇంతియాజ్ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఇంతియాజ్ వీఆర్ఎస్ పెట్టారు. ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతియాజ్ మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వైసీపీకి లాభిస్తుందని అధిష్టానం అంచనా వేస్తుంది.
కర్నూలు గ్రూప్ రాజకీయాలకు ఇంతియాజ్ తో చెక్
నిజాయితీ గల అధికారిగా పేరున్న ఇంతియాజ్..తన కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా ప్రజా సేవలో చురుకుగా పాల్గొంటారు. తన బావ డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ కర్నూలు నగరంలో రూ.2 వైద్యుడిగా పేరుపొందారు. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కోవిడ్ -19 సమయంలో మరణించారు. అతను తన సేవలను పేదలకు విస్తరించడానికి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పేదలు డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ దగ్గర చికిత్స పొందేందుకు కర్నూలుకు వచ్చేవారు. కర్నూలు వైసీపీలో రెండు గ్రూపుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజ్ ను సిద్ధం చేశారు. గత కొన్నేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, స్థానికంగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ల కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తు్న్నారు. ఇంతియాజ్ ఎంట్రీతో ఈ గొడవకు తెరపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.