Kurnool Student: లైంగిక వేధింపులతో కర్నూలు గురుకుల జూనియర్ కాలేజీ లైబ్రేరియన్‌పై దాడి..
Kurnool Student: విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన గురుకుల జూనియర్ కాలేజీ లైబ్రేరియన్‌పై వారి కుటుంబసభ్యులు దాడి చేయడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా బసవాసి గురుకుల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.
Kurnool Student: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై గురుకుల కాలేజీ లైబ్రేరియన్ లైంగిక వేధింపులు పాల్పడుతుండటం తెలిసిన బాలిక బంధువులు చితకబాదడం సంచలనం సృష్టించింది. కర్నూలు జిల్లా బనవాసిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బనవాసిలోని ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైబ్రేరియన్ మద్దిలేటి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు బుధవారం లైబ్రేరియన్‌పై దాడి చేశారు.
దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన అడ్డువచ్చిన ప్రిన్సిపల్ శ్రీనివాసగుప్తాను కూాడ చితకబాదారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. బనవాసిలో ఉన్న ఏపీ గురు కుల జూనియర్ కాలేజీలో 260 మంది విద్యార్థినులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
ఈ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజులుగా లైబ్రేరియన్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్నివిద్యార్థిని పలుమార్లు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రిన్సిపల్ సరిగా స్పందిం చకపోవడంతో విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్‌లో వివరించింది. ఈ క్రమం లో మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లిన లైబ్రేరియన్ మద్దిలేటిపై అర్ధరాత్రి ముసుగులు వేసుకొని వచ్చిన కొంతమంది దాడిచేసి పారిపోయారు.
ఈ క్రమంలో బుధవారం బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు లైబ్రేరియన్ వేధింపులపై ప్రిన్సిపల్ శ్రీనివాసగుప్తాతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడకు లైబ్రేరియన్ మద్దిలేటి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆయనపై దాడి చేసి చితకబాదారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్ అడ్డు చెప్పడంతో వారు ఆయనపై కూడా దాడి చేయడంతో ఆయనకు గాయా లయ్యాయి.
ఆ తర్వాత విద్యార్థిని కాలేజీ నుంచి టీసీ తీసుకుని వెళ్లిపోయిం ది. దాడిలో ప్రిన్సిపల్ కంటికి తీవ్రంగా గాయం కావడంతో కర్నూల్లోనిఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. బాలికల కాలేజీలో పురుష లెక్చరర్లు, లైబ్రేరియన్ వద్దని చెబుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రి పూట స్టడీ అవర్లకు పురుషులు వస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.