Kuppam Municipality: సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్
Kuppam Municipality: చంద్రబాబు సొంత జిల్లా సొంత నియోజక వర్గం కుప్పంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకీ రాజీనామా చేసిన కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం మునిసిపల్ ఛైర్మన్
Kuppam Municipality: కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సమక్షంలో సుధీర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు.