AP Govt Jobs : 164 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ముఖ్య తేదీలివే-krishna district recruitment 2023 for 164 para medical jobs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs : 164 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ముఖ్య తేదీలివే

AP Govt Jobs : 164 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 11, 2023 01:18 PM IST

Krishna District Jobs Recruitment : కృష్ణా జిల్లా వైద్యారోగ్యశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 164 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

కృష్ణా జిల్లాల్లో ఉద్యోగాలు
కృష్ణా జిల్లాల్లో ఉద్యోగాలు

Krishna District Para Medical Staff Recruitment 2023 : కృష్ణా జిల్లాలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేయనున్నారు. ఇందులో భాగంగా…. పట్టణలోని జీఎంసీ, GGH, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలోని పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మొత్తం 164 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబరు 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ముఖ్య వివరాలు :

రిక్రూట్ మెంట్ - వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కృష్ణా జిల్లా

మొత్తం ఖాళీలు - 164.

  1. ల్యాబ్ టెక్నీషియన్: 03
  2. ఫార్మసిస్ట్: 01
  3. కంప్యూటర్ ప్రోగ్రామర్: 02
  4. ఆఫీస్ సబార్డినేట్స్: 21
  5. జనరల్ డ్యూటీ అటెండెంట్స్: 28
  6. మార్చురీ అటెండెంట్: 03
  7. స్టోర్ కీపర్: 03
  8. ఎలక్ట్రికల్ హెల్పర్: 03
  9. ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్(పీఈటీ): 01
  10. పర్సనల్ అసిస్టెంట్: 01
  11. జూనియర్ అసిస్టెంట్: 03
  12. జూనియర్ స్టెనో/డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
  13. డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్: 02
  14. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
  15. హౌజ్ కీపర్స్/వార్డెన్స్: 02
  16. ఫిల్మ్ ఆపరేటర్: 01
  17. అటెండర్స్: 04
  18. క్లాస్ రూమ్ అటెండెంట్స్: 02
  19. డ్రైవర్స్ (హెవీ వెహికిల్): 02
  20. డ్రైవర్స్ (లైట్ వెహికిల్): 02
  21. వాచ్‌మ్యాన్: 04
  22. క్లీనర్స్/ వ్యాన్ అటెండెంట్: 02
  23. ఆయాలు: 02
  24. స్వీపర్లు: 03
  25. ల్యాబ్ అటెండెంట్స్: 03
  26. లైబ్రరీ అటెండెంట్స్: 03
  27. కుక్స్: 06
  28. కిచెన్ బాయ్/టేబుల్ బాయ్: 03
  29. ధోబీ: 01
  30. థోటీ/స్వీపర్స్: 03
  31. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 11
  32. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 11
  33. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 32
  34. క్లినికల్ సైకాలజిస్ట్: 01
  35. సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
  36. ఛైల్డ్ సైకాలజిస్ట్: 01
  37. స్పీచ్ థెరపిస్ట్: 01
  38. కార్డియాలజీ టెక్నీషియన్: 03
  39. స్టోర్ అటెండర్: 04

అర్హతలు - పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, పీజీ డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ,

వయోపరిమితి - 04.11.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు రుసుం - రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం - ఆఫ్‌లైన్‌ ద్వారా

ఎంపిక విధానం - అకడమిక్ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా - Office of the Principal Govt.Medical College, GGH Machilipatnam Krishna district.

అధికారిక వెబ్ సైట్ - https://krishna.ap.gov.in/

ముఖ్యమైన తేదీలు…

ముఖ్య తేదీలు
ముఖ్య తేదీలు
WhatsApp channel