kondapalli toys : కొండపల్లి బొమ్మ తయారీ కోసం కలప ఎన్ని నెలలు ఆరబెడతారో తెలుసా?
Kondapalli Bommalu : కొండపల్లి బొమ్మ.. పల్లె జీవనానికి ప్రతిరూపాలు. వాటిని చూస్తే.. మనసుకు ఎంతో హాయి. ఒక్కసారి పల్లెటూరి అందాలను చూసిన తృప్తి కలుగుతుంది. భాగ్యనగరంలోని ఓ మాల్ లో దర్శనమిచ్చాయి. ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది.
హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఓ మాల్ లో కొండపల్లి బొమ్మల(Konapalli Bommalu) కొలువు పలువురిని ఆకర్షించాయి. పల్లెల్లో జీవితాన్ని ప్రతిబింబించే 25-30 నేర్పుగా చెక్కిన కొండపల్లి బొమ్మలు ప్రదర్శనలో ఉన్నాయి. పిల్లలు బొమ్మల వెనక ఉన్న కథలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపించారు. వీటిని కళాకారులు వివరించారు.
దసరా(Dasara) సందర్భంగా ఎద్దుల బండ్లు, ఏనుగులు, కృష్ణుడి పది అవతారాలకు ఎక్కువ డిమాండ్ ఉందని కొండపల్లి బొమ్మలు(Kondapalli Bommalu) తయారు చేసే వాళ్లు చెబుతున్నారు. గ్రామాల్లో జీవనశైలి, వారి సంప్రదాయం, సంస్కృతి, రోజువారీ పనులను చూపిస్తున్నట్టుగా బొమ్మలను తయారు చేస్తారు. పట్నానికి వచ్చిన పల్లెటూరి వారికి వీటిని చూస్తే.. ఒక్కసారిగా గతం గుర్తుకువస్తుంది. కల్యాణం మండపం, పూజారి, సంగీత విద్వాంసులు.. ఇలా ప్రతిదీ చక్కగా తయారు చేస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి సమయంలో శ్రీకృష్ణుడు, గోవులు, సీత, రాముడు(Rama), లక్ష్మణులను తయారు చేస్తారు. వాటికి ఈ సమయంలో ఎక్కువ డిమాండ్ ఉంటుందట.
ఓ మాల్ లో ఏర్పాటు చేసిన కొండపల్లి బొమ్మల కొలువులో.. కూరగాయల మార్కెట్‌ను సూచిస్తూ బొమ్మలు(Toys), సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు, పడవలు, పొంగల్ తయారీ యువకులు.. ఇలా ఎన్నో ఆకట్టుకున్నాయి. కొండపల్లి బొమ్మలు(Kondapalli Toys) ప్రత్యేకంగా ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్దలూ వీటిని చూసి మురిసిపోతారు.
తమ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో ఈ బొమ్మలకు డిమాండ్ పెరిగిందని కళాకారులు చెబుతున్నారు. బొమ్మల తయారీకి కలప మొదట ఆరిపోవడానికి కనీసం 2 నెలలు పడుతుందట. 'ఇది అంత ఈజీ కాదు.. వాతావరణం అనుకూలించాలి. పొడి వాతావరణం కూడా కావాలి. కలప ఆరిపోయేందుకు 2 నెలలు సమయం పడుతుంది. తర్వాత సొంతంగా బొమ్మలు డిజైన్ చేసి చేతితో తయారు చేసి, వైట్‌వాషింగ్, పాలిషింగ్ చేసి పెయింటర్లకు అందజేస్తారు. కొండపల్లి బొమ్మల గిరాకీ ఇప్పుడు పెరగడంతో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ సంపాదిస్తున్నారు.
విజయవాడ(Vijayawada)కు సమీపంలో ఉన్న ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి అంటే ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా కొండపల్లి బొమ్మలకు మంచి పేరుంది. ఈ బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. చుట్టుపక్కల అడవు(Forest)లలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కను తీసుకొచ్చి బొమ్మలు తయారు చేస్తారు. మెుదట బొమ్మల విడిభాగాలు తయారు చేసి.. తరువాత వాటిని చింతగింజల పొడుంతో తయారు చేసిన బంకతో ఒకటిగా అతికిస్తారు.
దసరా, సంక్రాంతి(Pongal) వేడుకల్లో బొమ్మల కొలువు సంప్రదాయంలో ఈ కొండపల్లి బొమ్మలు ఉంటాయి. ఏ ఇంట్లో బొమ్మల కొలువు జరిగినా అందులో కొండపల్లి బొమ్మలు కనిపించాల్సిందే. కొండపల్లి బొమ్మల తయారీదారులు ఈ సమయంలోనే తమ వ్యాపారం ఎక్కువగా చేస్తారు.