Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్ కొండాపూర్ లోని ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. అయితే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగిందిం. కానీ గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని ఏఐజీ వైద్యులు చెబుతున్నారు.
కొడాలి నాని గతంలో గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య? మళ్లీ గుండెకు సంబంధించిత సమస్య తలెత్తిందా? అనేది తేల్చేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొడాలి నానికి గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో హాస్పిటల్‌లో చేరారని అనుచరులు, సన్నిహితులు చెబుతున్నారు.
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి నానిని మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన పేర్ని నాని...కొడాలి నానిని పరామర్శించి, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైసీపీలో కీలకగా ఉన్న కొడాలి నాని 2019లో గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లై మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసే మంత్రుల్లో కొడాలి నాని ముందుండేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. అయితే 2024 ఎన్నికల్లో కొడాలి నాని అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి నాని పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. అడపాదడపా మీడియా ముందుకు వస్తున్నారంతే. ఇందుకు ఆరోగ్య సమస్యలే కారణమని ఆయన అనుచరులు చెబుతున్నారు.
సంబంధిత కథనం