కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే-key decisions approved by ap cabinet details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలిపింది. అమరావతి రెండో దశలో భూసేకరణ అంశంపై మంత్రులు చర్చించారు. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 9 అంశాలు అజెండాగా మంత్రవర్గ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. "తల్లికి వందనం" కార్యక్రమానికి నిధుల విడుదలపై మంత్రులు చర్చించారు.

ఏపీ కేబినెట్ భేటీ - ముఖ్య నిర్ణయాలు:

  • హెచ్‍వోడీ 4 టవర్ల టెండర్లకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం
  • అమరావతి రెండో దశలో భూమి సేకరణ అంశంపై మంత్రులు చర్చించారు. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
  • శ్రీకాకుళంలో మంచినీటి సరఫరాకు రూ.5.75 కోట్లు కేటాయింపులు.
  • కుప్పంలో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం రూ.8.22 కోట్ల. విడుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం.
  • 17 మంది ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపైనా నిర్ణయం.
  • 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పనకు ఆమోదం
  • వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఇచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.
  • పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనపై మంత్రివర్గం నిర్ణయం.
  • పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం.
  • పరిశ్రమలకు సంబంధించిన 2025 చట్టంలో సవరణలకు ఆమోదముద్ర.
  • అమరావతి నిర్మాణంను వేగవంతం చేయడానికి ముఖ్యమైన ప్రణాళికలపై సుదీర్ఘ చర్చ
  • జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.