రాష్ట్రంలో భూముల రీ సర్వే మళ్లీ మొదలైంది. జనవరి 10వ తేదీ నుంచి సర్కార్ భూముల లెక్కలను తీస్తున్నారు. పక్కాగా కొలుస్తూ రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక రేపట్నుంచి(జనవరి 20) ప్రైవేట్, వ్యవసాయ భూములకు కొలతలు వేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.
భూముల రీసర్వేకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భూ యజమానుల సమక్షంలోనే రీసర్వే చేస్తామని స్పష్టం చేశారు. హద్దుల విషయంలో సరైన స్పష్టత ఇస్తామని చెప్పారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3 సార్లు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కొలుతల సమయంలో యజమాని రాకుంటే… వీడియో కాల్ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌ల ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో భూముల రీసర్వే చేపట్టారు. అయితే ఇందులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వీటిని సరి చేసేందుకే భూములను రీసర్వే చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం జరగబోయే సర్వేకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి….
సంబంధిత కథనం