Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రత్యేకంగా స్వామికి బిల్వార్చన, కార్మిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ కార్తిక మాసోహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటలకు కాఠక పారాయణలు, శివ పంచాక్షకి, లక్ష్మీ గణపతి జపాలు, సహస్ర లింగార్చన జరుగుతాయి. రోజూ సాయంత్రం 3.30 నుంచి ఏడు గంటలకు వరకు అభిషస్త్రకాలను నిర్వహిస్తారు. స్వామికి జరిగే అభిషేకాల్లో పాల్గొనే భక్తులు టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేవస్థానం టికెట్లను అందుబాటులో తీసుకొచ్చింది.
కార్తిక మాసం నెల రోజులు ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయం, మల్లేశ్వరస్వామి ఆలయం, శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. సాయంత్రం స్వామికి మహా నివేదన, పంచ హారతులు, చతుర్వేద స్వస్తి, అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతాయి. ఆది దంపతుల ఉత్సవ మూర్తులకు సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది.
కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని నవంబర్ 15వ తేదీన కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆది దంపతుల ఆలయాలతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, మహా మండపం, రాజ గోపురం, ఘాట్ రోడ్డు పరిసరాలను దీపాలతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా స్వామికి బిల్వార్చన, జ్వాలా తోరణం వంటి వాటిని కూడా విషేశంగా నిర్వహిస్తారు. కార్తిక మాసోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నవంబర్ 15న జరిగే కోటి దీపోత్సవం చాలా కీలకమైంది. కనుక కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.