Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?-karnataka chikkmagaluru hill station best tourist spot for summer vacation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Bandaru Satyaprasad HT Telugu
May 19, 2024 01:25 PM IST

Chikkamagaluru : సమ్మర్ హీట్ నుంచి రిలీఫ్ కోసం అలా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు, నగర జీవనానికి కాసేపు ఫుల్ స్టాప్ పెట్టి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని భావిస్తే చిక్కమగళూరు బెస్ట్ స్పాట్. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి 250 కి.మీ దూరంలో ఉంది ఈ హిల్ స్టేషన్.

ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్
ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్

Chikkamagaluru : ఈ వేసవిలో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే కర్ణాటకలోని చిక్కమగళూరు హిల్ స్టేషన్ బెస్ట్ స్పాట్. ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి, బిజీ లైఫ్ ను దూరంగా ప్రకృతి ఒడిలో మనసు ప్రశాంతత కోసం చిక్కమగళూరు చక్కటి టూరిస్ట్ ప్లేస్. చిక్కమగళూరు టూర్ కేవలం వేసవి హీట్ నుంచి రిలీఫ్ కోసం మాత్రమే కాకుండా సాహసం, ప్రశాంతత, సంస్కృతి సమ్మేళనంగా మీ టూర్ ఉంటుంది. ముల్లయనగిరిపై పొగమంచుతో నిండిన మార్గాల్లో ట్రెక్కింగ్, సుగంధ కాఫీ ఎస్టేట్‌లను ప్రయాణాలు, హెబ్బే వాటర్ ఫాల్స్ అందాల వీక్షిస్తూ క్యాంప్ లో విశ్రాంతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. స్థానిక రుచికరమైన అక్కి రొట్టి వంటకాలను ఆస్వాదించవచ్చు. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లోని జీవవైవిధ్యాన్ని చూడవచ్చు. చిక్కమగళూరు మీ సమ్మర్ వెకేషన్ కు సరైన ఆనందాన్ని అందిస్తుంది.

సాహసికులకు బెస్ట్ స్పాట్

చిక్కమగళూరును కర్ణాటకలోని కాఫీ జిల్లాగా పిలుస్తారు. కాఫీ ప్రియులకు ఇది ప్రసిద్ధ ప్రదేశం. అద్భుతమైన కొండలు, లోయలతో నిండి, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ నిర్మలమైన పట్టణం. ప్రకృతి ఒడిలో బసను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ముల్లయనగిరి ట్రెక్కింగ్ నుంచి భద్ర నదిలో రివర్ రాఫ్టింగ్ వరకు అనేక సాహసాలు చేయవచ్చు. నగర జీవనానికి కాసేపు ఫుల్ స్టాఫ్ పెట్టి ప్రకృతితో మమేకం అయ్యేందుకు, ఒంటరిగా ప్రశాంతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇది గొప్ప ప్రదేశం. ఇక్కడి స్వచ్ఛమైన గాలి మిమ్మల్ని మీకు సరికొత్తగా పరిచయం చేస్తుంది.

కాఫీ తోటల్లో ట్రెక్కింగ్

కఠినమైన పర్వత మార్గాలు, అనేక కొండలు, లోయలు, మంచినీటి ప్రవాహాలు, కర్నాటకలోని ఎత్తైన శిఖరం ముల్లయనగిరితో పాటు అనేక కొండలకు నిలయం చిక్కమగళూరు. ఇది ట్రెక్కర్స్ కు బెస్ట్ స్పాట్ అంటారు. చిక్కమగళూరు సమీపంలో అనేక వన్యప్రాణుల అభయారణ్యాలు, పురాతన దేవాలయాలు, కోటలను అన్వేషించవచ్చు. కాఫీ తోటల గుండా ట్రెక్కింగ్ ఆస్వాదించవచ్చు. అద్భుతమైన సూర్యాస్తమయాన్ని మీ కళ్లతో బంధించవచ్చు. చిక్కమగళూరులోని పశ్చిమ కనుమల అందాలను ఆస్వాదించేందుకు ఏడాదిలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే అంటూరు పర్యాటకలు.

చిక్కమగళూరు సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాలు

శృంగేరి (90 కి.మీ.), కల్హట్టి జలపాతం (54 కి.మీ.), ముల్లయనగిరి శిఖరం (25 కి.మీ.), బెలవాడి (30 కి.మీ.)

శృంగేరి శారదాంబ దేవాలయం-సరస్వతీ దేవి ఆలయం వాస్తు శిల్పం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి.

భద్ర ఆనకట్ట - నిర్మలమైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్ వద్ద బోటింగ్, ఫిషింగ్, సుందరమైన ప్రకృత్తి అందాలను వీక్షించవచ్చు.

ఝరి జలపాతం- జలపాతాన్ని బటర్ మిల్క్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇది రిఫ్రెష్ రిట్రీట్ అందించే అద్భుతమైన జలపాతం

కల్హటి జలపాతం - ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ అడవుల మధ్య ఉన్న మరో సుందరమైన వాటర్ ఫాల్స్ ఇది.

చిక్కమగళూరు ఎలా చేరుకోవాలి?

విమాన మార్గం : మంగళూరు(80 కి.మీ) సమీప విమానాశ్రయం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిక్కమంగళూరు చేరుకోవచ్చు.

రైలు మార్గం : కడూర్ జంక్షన్ సమీప రైల్వే స్టేషన్ (40 కి.మీ)

రోడ్డు మార్గం: బెంగళూరు నుంచి 250 కి.మీ దూరంలో చిక్కమగళూరు ఉంది.

గోల్డెన్ చేరియట్ లో భాగంగా 6 రోజుల ప్రైడ్ ఆఫ్ కర్ణాటక టూర్ ప్యాకేజీని కర్ణాటక టూరిజం అందిస్తుంది. ఇందులో బెంగళూరు - నంజన్‌గూడు - మైసూర్ - హళేబీడు - చిక్కమగళూరు - హోస్పేట్ - గోవా - బెంగళూరు సందర్శించవచ్చు. పూర్తి వివరాలకు కోసం https://www.goldenchariot.org/ ఈ వెబ్ సైట్ ను విజిట్ చేయండి.