కర్నూలులో 150 పడకలతో కామినేని ఆసుపత్రి-kamineni group started a 150 bed hospital in kurnool
Telugu News  /  Andhra Pradesh  /  Kamineni Group Started A 150 Bed Hospital In Kurnool
కర్నూలు కామినేని హాస్పిటల్
కర్నూలు కామినేని హాస్పిటల్

కర్నూలులో 150 పడకలతో కామినేని ఆసుపత్రి

18 January 2023, 12:54 ISTHT Telugu Desk
18 January 2023, 12:54 IST

హైదరాబాద్‌, నార్కట్‌పల్లి, విజయవాడలో ఆసుపత్రులను నెలకొల్పిన కామినేని హాస్పిటల్స్ సంస్థ తాజాగా కర్నూలులో కూడా 150 పడకల ఆసుపత్రి ప్రారంభించింది.

వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్‌ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్స్‌ పేరుతో రూ. 150 కోట్లతో 150 పడకల సామర్థ్యంతో ఇది ఏర్పాటైంది.

కాగా ఈ ఏడాదే రూ. 75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్‌ గ్రూప్ వివరించింది.

కార్డియాక్‌, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్‌ కేర్‌, జనరల్‌ మెడిసిన్‌, మెడికల్‌, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, ప్లాస్టిక్‌/కాస్మెటిక్‌ సర్జరీ, రెనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, యూరాలజీ, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీస్‌, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

పారదర్శకత, ప్రతిస్పందన, నైతికత అనే మూడు స్తంభాలకు కట్టుబడి కామినేని హాస్పిటల్స్ ఆరోగ్య సంరక్షణ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సమాజ అవసరాలకు అవిశ్రాంతంగా పనిచేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలతో కోట్లాది మందికి చేరువైన కామినేని హాస్పిటల్స్‌ మొత్తం 3,000లకుపైగా పడకలతో హైదరాబాద్‌, నార్కట్‌పల్లి, విజయవాడలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు ఉన్నాయి.