Madakasira Kalyani: మడకశిరలో రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు
Madakasira Kalyani: రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిరకు భారీ పెట్టుబడి రానుంది. రూ.1430కోట్లతో కొత్త పరిశ్రమను ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త పరిశ్రమతో దాదాపు 565 ఉద్యోగాలు లభించనున్నాయి.
Madakasira Kalyani: సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందన్నారు. రూ.1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరిశ్రమతో 565 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించనుందని మంత్రి సవిత తెలిపారు.
రాష్ట్రంలో ఒకవైపు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహానిస్తూ, భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గత వైసీపీ పాలనలో వేధింపులు తాళలేక తరలిపోయిన పరిశ్రమలను వెనక్కి రప్పించడానికి సీఎం చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని మంత్రి సవిత వివరించారు.