Kakinada : కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృత్యువాత, విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం
Kakinada Olive Ridley Turtle : కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
Kakinada Olive Ridley Turtle : కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణిస్తుండడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అరుదైన జాతిగా చెబుతారు.ఈ తాబేళ్లు ఆహారం, గుడ్లు, సంతానోత్పత్తి 20 వేల కి.మీ ప్రయాణిస్తాయి. ఇవి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఆలివ్ రిడ్లీ ప్రత్యేక సంతానోత్పత్తి, మానవ కార్యకలాపాలతో వీటికి మప్పు ఏర్పడుతుంది. ఈ తాబేళ్లు ఏపీ, ఒడిశా తీర ప్రాంతాలకు సంతానోత్పత్తి కోసం వలస వస్తాయి. ముఖ్యంగా నదులు, సముద్రం కలిసి చోట ఈ తాబేళ్లు వీటి సంతానోత్పత్తికి అనుమైన ప్రదశంగా చెప్పవచ్చు. అందుకు ఈ కాలంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తాబేళ్లు తీరంలో గోతుల తవ్వి గుడ్లు పెట్టి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇలా పొదిగిన గుడ్లు పిల్లలుగా తయారై సముద్రంలోకి వెళ్లాయి.
కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ వ్యవహారంపై తనిఖీలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాకలపూడి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధ వాయువులు విడుదల విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం ఉదయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి సరకులు వాడుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేలింది. దీనిపై మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలియచేశారు.
సంబంధిత కథనం