Vijayawada Job Mela: రేపు విజయవాడలో జాబ్ మేళా, రూ.12-35వేల వేతనంతో ఉద్యోగావకాశాలు-job fair tomorrow in vijayawada job opportunities with salary of rs 12 35 thousand ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Job Mela: రేపు విజయవాడలో జాబ్ మేళా, రూ.12-35వేల వేతనంతో ఉద్యోగావకాశాలు

Vijayawada Job Mela: రేపు విజయవాడలో జాబ్ మేళా, రూ.12-35వేల వేతనంతో ఉద్యోగావకాశాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 04, 2024 10:26 AM IST

Vijayawada Job Mela: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతాయి. రూ.12వేల నుంచి రూ.35వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

రేపు విజయవాడలో మెగా జాబ్‌ మేళా
రేపు విజయవాడలో మెగా జాబ్‌ మేళా

Vijayawada Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్‌డిఎ - సీడాప్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 5వ తేదీ మంగళవారం విజయవాడ "ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో, ముత్తూట్ ఫిన్‌కార్ప్, SBI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.35,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

నవంబర్ 5 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు వివరించారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు https://tinyurl.com/jobmela-vjdeast లింక్ నందు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే జాబ్ మేళాకు తమ రెజ్యూమె- బయోడేటా లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Whats_app_banner