Jio 5G Services in AP: ఏపీలోని మరో 6 పట్టణాల్లో జియో 5 జీ సేవలు ప్రారంభం
Jio 5g Services: రిలయన్స్ జియో తన ట్రూ 5 జీ సేవలను ఏపీలోని ఒక్కో నగరానికి విస్తరించే పనిలో పడింది. కొత్తగా మరో 6 పట్టణాల్లో సేవలను ప్రారంభించింది. ఇక తెలంగాణలోని సూర్యాపేటలో కూడా సేవలు షురూ అయ్యాయి. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
Jio 5g Services in Andhrapradesh: రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆంధ్రప్రదేశ్ లో వేగంగా విస్తరించే పనిలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు నగరాల్లో ప్రారంభించగా.. తాజాగా మరో 6 పట్టణాల్లో కూడా సేవలను షురూ చేసింది. కొత్తగా ఈ జియో 5జీ సేవలు... అమలాపురం, ధర్మవరం, కావలి, తణుకు, తుని, వినుకొండ పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఈ 6 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవలను పొందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఏపీలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Jio 5G in Andhra Pradesh: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్లు, నంద్యాల, తెనాలి నగరాల్లో ఇప్పటికే సేవలు అందుతున్న నగరాల్లో ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 18 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవలను పొందుతున్నారు. తాజాగా మరో నగరంలో కూడా జియో సేవలు షురూ అయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేటలో కూడా ఈ సేవలు ప్రారంభించినట్లు జియో ప్రకటించింది. ఫలితంగా మొత్తం 19 పట్టణాల్లో ఈ సేవలు అందుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 365 పట్టణాలకు చేరింది.
Jio 5G Welcome Offer: జియో 5జీ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో వెల్‍కమ్ ఆఫర్‌ను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కింద, 5జీ నెట్‍వర్క్‌పై అన్‍లిమిటెడ్ డేటాను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూజర్లు వాడుకోవచ్చు. అయితే 5జీ నెట్‍వర్క్‌పైనే ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. జియో 5జీ కోసం వినియోగదారులు సిమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్‍తోనే 5జీని వాడుకోవచ్చు. అయితే 5జీకి సపోర్ట్ చేసే మొబైల్ ఉండాలి.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ గురించి:
జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 4జీ ఎల్ టిఇ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ఆల్-ఐపీ డేటా స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్ వర్క్ ను నిర్మించింది. వారసత్వ మౌలిక సదుపాయాలు, దేశీయ 5 జీ స్టాక్ లేకుండానే ఇప్పుడు 5 జీ నెట్ వర్క్ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయి నుంచే మొబైల్ వీడియో నెట్ వర్క్ గా భావిస్తున్న ఏకైక నెట్ వర్క్ ఇది. ఇది భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉంది. సాంకేతికతలు 6జీ మరియు అంతకుమించి ముందుకు సాగుతున్నందున మరింత డేటాకు మద్దతు ఇవ్వడానికి సులభంగా అప్ గ్రేడ్ చేయవచ్చు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానం దిశగా నడిపించడానికి భారతీయ డిజిటల్ సేవల రంగంలో అపారమైన మార్పులను తీసుకొచ్చింది జియో.
సంబంధిత కథనం