కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. నవంబర్ 26 వరకు విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదే విధంగా దరఖాస్తుల్లో సవరణకు నవంబర్ 26 తర్వాత రెండు రోజులు కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు. ఏపీలో 15, తెలంగాణలో 9 జనహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
నవోదయ విద్యాలయ సమితి (NVS) లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరోసారి పొడిగించింది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును నవోదయ వెబ్ సైట్ navodaya.gov.in ద్వారా నవంబర్ 26 లోపు పూర్తి చేయాలి. ఎన్వీఎస్ దరఖాస్తుల కరెక్షన్ విండో నవంబర్ 26 తర్వాత ఓపెన్ కానుంది. విద్యార్థులు తమ అప్లికేషన్లలో జెండర్, కేటగిరి (జనరల్/OBC/SC/ST), ప్రాంతం (గ్రామీణ/అర్బన్), వైకల్యం, పరీక్షా మాధ్యమం ఎడిట్ చేసుకోవచ్చు.
నవోదయ 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 8, 2025న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో మూడు విభాగాలు ఉంటాయి.
1. జవహర్ నవోదయ అధికారిక వెబ్‌సైట్‌ను navodaya.gov.in ను సందర్శించండి.
2. అడ్మిషన్స్ విభాగంలో NVS అడ్మిషన్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
3. సూచనలను ఒకసారి చదివి, అవసరమైన వివరాలను నమోదు చేసుకోండి.
4. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
5. అందుబాటులో ఉన్న చెల్లింపు విధానం ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
6. అప్లికేషన్ సరిచూసుకుని సబ్మిట్ చేయండి.
7. భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
రాష్ట్రంలో పాఠశాలల్లో టైమింగ్స్ మారనున్నాయి. అందుకు రాష్ట్ర కొత్త టైమింగ్స్ తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ముందు, పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. విద్యా సంవత్సరంలో 2024-25లో పాఠశాల సమయాలను మార్చాలని ప్రతిపాదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాత పని వేళలు, వెయిటేజీలతో పాటు, ప్రతి పీరియడ్ సమయాన్ని మాత్రమే పెంచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా ప్రతి ఉపాధ్యాయుడు సిలబస్‌ను కవర్ చేయడానికి, అలాగే బోధనా అభ్యాస ప్రక్రియకు తగినంత సమయం ఇవ్వనున్నారు.
సంబంధిత కథనం