Janasena NagaBabu: ఏపీలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే స్వర్ణయుగం వస్తుందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు జోస్యం చెప్పారు. ఏపీలో రానున్నది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమేనని, లక్షల కోట్లు దోచుకునే వారు అధికారంలోకి వస్తున్నప్పుడు ప్రజా ప్రయోజన కోసం జనసేన పాలనకు ఎందుకు రాదన్నారు.
యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో నాగబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కాలంలో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు. జనసేన ప్రభుత్వంలో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతీ ఒక్కరికీ ప్రయోజనకరమైన పాలన ఉంటుందని చెప్పారు.
అవినీతి నాయకులు దోచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ప్రజా ప్రయోజన పాలన కోసం ఎందుకు రాదని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉందని అన్నారు.
యువతను గంజాయి మత్తుకు, రవాణాకు అలవాటు చేసి వేలాది మంది యువకులను జైళ్లలో మగ్గెలా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని నాగబాబు విమర్శించారు. గంజాయిని కేరాఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఆస్తులు దాదాపుగా దోచుకున్నారని, ఆలయానికి వచ్చే ఆదాయం ఎటు పోతోందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదని అన్నారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని బాధ్యతతో స్వీకరించానని, జనసేన అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పని చేస్తానని నాగబాబు చెప్పారు. 'రాబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దు. జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం మొదలైందని, గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఓటింగ్ శాతం 35కు పెరిగిందని అంచనాలు చెబుతున్నాయన్నారు. పార్టీకి మహిళలు ఆక్సిజన్ లాంటి వారని, పవన్‌కి సలహాలు ఇవ్వవద్దు. ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దామని నాగబాబు పేర్కొన్నారు.
hty