Pawan On AP Govt : నష్టాల్లో ఉన్న బైజూస్ కు వందల కోట్ల కాంట్రాక్ట్- ఏపీ ప్రభుత్వంపై పవన్ ప్రశ్నలు-janasena chief pawan kalyan questioned ap govt on byjus contract demands details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan On Ap Govt : నష్టాల్లో ఉన్న బైజూస్ కు వందల కోట్ల కాంట్రాక్ట్- ఏపీ ప్రభుత్వంపై పవన్ ప్రశ్నలు

Pawan On AP Govt : నష్టాల్లో ఉన్న బైజూస్ కు వందల కోట్ల కాంట్రాక్ట్- ఏపీ ప్రభుత్వంపై పవన్ ప్రశ్నలు

Bandaru Satyaprasad HT Telugu
Jul 22, 2023 04:13 PM IST

Pawan On AP Govt : ఏపీ ప్రభుత్వం, బైజూస్ సంస్థ ఒప్పందంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థకు ఏ ప్రాతిపదికన వందల కోట్ల టెండర్ కట్టబెట్టారని ప్రశ్నించారు. ట్యాబ్ లు మంచివిషయమే కానీ ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan On AP Govt : ఏపీ ప్రభుత్వంపై గురిపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చింది. ఈ విషయంలో పవన్ స్పందించారు. విద్యార్థులకు ట్యాబ్ లు మంచి విషయమే అన్న పవన్... పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిస్థితేంటని ప్రశ్నించారు. బైజూస్ యాప్స్ ఒక చాయిస్ అని, పాఠశాలకు టీచర్ తప్పనిసరి అని ట్వీట్ చేశారు. బైజూస్‌ను చూపించి జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. బైజూస్‌ ద్వారా ఏదో సాధించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని హితవు పలికారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసే లేదని, ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదు. వారికి శిక్షణ ఇవ్వడం లేదు. నష్టాలతో నడుస్తున్న స్టార్టప్‌కు మాత్రం వందల కోట్ల కాంట్రాక్టు అని ప్రశ్నించారు. విద్యార్థులకు టాబ్ ల అందించే టెండర్‌ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. టెండర్ల ప్రక్రియలో ప్రమాణాలను వైసీపీ ప్రభుత్వం పాటించిందా? ఎన్ని కంపెనీలను టెండర్లలో పాల్గొన్నాయి ? ఎవరెవర్ని షార్ట్ లిస్ట్ చేశారు? వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ పబ్లిక్ డోమైన్ లో పెట్టారా? ఈ కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్వీట్టర్ లో పవన్ డిమాండ్ చేశారు. ఈ ట్వీట్ ను ప్రధాని మంత్రి ఆఫీస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు ట్యాగ్ చేశారు. బైజూస్ స్టార్టప్ ఎలా కుప్పకూలిపోయిందో వివరించే ఓ వీడియో లింక్ ను పోస్టు చేశారు పవన్. విద్యార్థులకు ట్యాబ్స్ మంచివే పాఠశాలల్లో మరుగుదొడ్లు ముందుగా నిర్మించాలన్నారు.

బైజూస్ తో వందల కోట్ల ఒప్పందం

కరోనా టైంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా బాగా ఎదిగింది. బైజూస్ కంటెంట్ లో సరైన క్వాలిటీ లేకపోవడం, స్కూళ్ల ప్రారంభంతో... బైజూస్ సంస్థకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. బైజూస్ ఆదాయం కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ నష్టాల్లో కూరుకుపోయింది. అయితే బైజూస్ కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం.. ఈ సంస్థతో రూ. 700 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఎనిమిదో తరగతి, ఆపై విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో ఉచితంగా ట్యాబ్స్ పంపీణ చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ట్యాబ్స్ మాత్రమే కొనుగోలు చేశామని, కంటెంట్ ఉచితంగా ఇస్తున్నారని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది.

Whats_app_banner