Mata Vaishnodevi IRCTC Package : జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!-jammu kashmir mata vaishnodevi temple visit irctc tour package details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mata Vaishnodevi Irctc Package : జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Mata Vaishnodevi IRCTC Package : జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Mata Vaishnodevi IRCTC Package : జమ్మూ కశ్మీర్ లో మాతా వైష్ణో దేవి ఆలయం సందర్శనకు ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. దిల్లీ నుంచి వందే భారత్ ట్రైన్ లో పర్యాటకులు వైష్ణో దేవి ఆలయానికి చేరుకోవచ్చు. టూర్ వివరాలు ఇలా ఉన్నాయి.

జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Mata Vaishnodevi IRCTC Package : జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ వందే భారత్ ట్రైన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. దిల్లీ నుంచి రెండ్రోజుల్లో వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దిల్లీ నుంచి గురువారం నుంచి సోమవారం వరకు ఆ యాత్ర అందుబాటులో ఉంది. ప్రారంభం ధర రూ.7290లతో ఐఆర్సీటీసీ డివైన్ హైట్స్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

జమ్మూ కశ్మీర్ లో ని పవిత్ర పుణ్యక్షేత్రం మాతా వైష్ణో దేవి ఆలయం. హిందువులు పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా దీనిని భావిస్తారు. ఈ పుణ్యక్షేత్రానికి ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా రూపొందించిన రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సౌకర్యవంతమైన ఏసీ చైర్ కార్ లో యాత్రికులు ప్రయాణించవచ్చు. న్యూ దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. కత్రాలోని హోటల్‌లో బస చేస్తారు.

ప్యాకేజీ టారిఫ్:

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 Years)చైల్డ్ వితవుట్ బెడ్(5-11 years)
కంఫర్ట్రూ.9145రూ.7660రూ.7290రూ.6055రూ.5560

టూర్ వివరాలు : న్యూ దిల్లీ - కత్రా - న్యూదిల్లీ

డే 01 : న్యూ దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:00 గంటలకు SVDK వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22439) బయలుదేరుతుంది. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (SVDK) రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 2:00 గంటలకు చేరుకుంటారు. రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులను పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ప్రయాణికుల రిక్వైర్మెంట్ ప్రకారం బంగంగా వద్ద డ్రాప్ చేస్తారు. అనంతరం మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. బంగంగా నుంచి పర్యాటకులను పికప్ చేసి హోటల్‌కి తీసుకోస్తారు. హోటల్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 02 : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేశాక... మీ తీరిక మేరకు హోటల్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు లేదా పట్టణాన్ని అన్వేషించవచ్చు. మధ్యాహ్నం 2:00 గంటలకు హోటల్‌ నుంచి చెక్ అవుట్ చేసి 3:00 గంటలకు కత్రా రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తారు. ఇక్కడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 22440) ఎక్కి రాత్రి 11.00 గంటలకు న్యూ దిల్లీ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీలో చేరికలు

  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22439/22440)లో CCలో ఇరువైపులా రైలు టికెట్లు అందిస్తారు.
  • కత్రాలో ఏసీ సౌకర్యం కలిగిన హోటల్‌ లో వసతి.
  • భోజనం: 01 అల్పాహారం, హోటల్‌లో 01 లంచ్, 01 డిన్నర్ (ప్యాక్డ్ లేదా ప్యాసింజర్ అవసరాలు అనుగుణంగా)
  • SVDK రైల్వే స్టేషన్ నుంచి హోటల్ కు పికప్, డ్రాప్ సర్వీస్.
  • హోటల్ నుంచి బంగంగా మధ్య పికప్, డ్రాప్ సర్వీస్
  • రైల్వేస్ ద్వారా ఆన్-బోర్డ్ క్యాటరింగ్

ఐఆర్సీటీసీ మాతా వైష్ణో దేవి ఆలయం టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై https://irctctourism.com/pacakage_description?packageCode=NDR010 క్లిక్ చేయండి.