IRCTC Vizag Tour Package : 2 రోజుల వైజాగ్ ట్రిప్ - సింహాచలం కూడా వెళ్లి రావొచ్చు, రూ. 4 వేల ధరలోనే ప్యాకేజీ-irctc tourism two days simhachalam tour package from visakhapatnam read the full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Tourism Two Days Simhachalam Tour Package From Visakhapatnam Read The Full Details Are Here

IRCTC Vizag Tour Package : 2 రోజుల వైజాగ్ ట్రిప్ - సింహాచలం కూడా వెళ్లి రావొచ్చు, రూ. 4 వేల ధరలోనే ప్యాకేజీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 24, 2024 12:19 PM IST

IRCTC Vizag Simhachalam Tour 2024: వైజాగ్ లోని పలు టూరిజం ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ టూరిజం. 'వైజాగ్ బ్లిస్' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి....

సింహాచలం టూర్ ప్యాకేజీ
సింహాచలం టూర్ ప్యాకేజీ (https://unsplash.com/)

IRCTC Vizag - Simhachalam Touri Package 2024: సమ్మర్ లో ఏదైనా అధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించాలని అనుకుంటున్నారా…? అయితే మీలాంటి వారికి ఓ సూపర్ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఈ టూర్ కేవలం అధ్యాత్మిక ప్రాంతాన్ని మాత్రమే కాదు… వైజాగ్ సిటీలోని పలు టూరిజం స్పాట్ లను కూడా చూసే అవకాశం కలిపిస్తోంది. వీకెండ్ లో 'వైజాగ్ బ్లిస్(VIZAG BLISS' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

వైజాగ్ బ్లిస్(Vizag) టూర్ ప్యాకేజీ అనేది 2 రోజులుగా ఉంది. ఇందులో ఒక నైట్, ఒక డే ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ… మార్చి 29,2024వ తేదీన అందుబాటులో ఉంది. వైజాగ్ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తారు.

ఫస్ట్ డే : ఈ ప్యాకేజీ విశాఖ నుంచి స్టార్ట్ అవుతుంది. విశాఖలోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. సోమవారం టూర్ వెళ్లే వారు మాత్రం.. రామనాయాడు ఫిల్మ్ స్టూడియో కూడా చూస్తారు. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు. ఫిషింగ్ హార్బర్ లో బోటింగ్ కూడా ఉంటుంది. తిరిగి హోటల్ కు వస్తారు. రాత్రి బోజనం తర్వాత... విశాఖలోనే రాత్రి ఉండాల్సి ఉంటుంది.

సెకండ్ డే : ఇక రెండోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. దర్శనం తర్వాత వైజాగ్ వస్తారు. దీంతో ఈ రెండు రోజుల టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

'వైజాగ్ బ్లిస్' టూర్ ప్యాకేజీ ధరలు

VIZAG BLISS Tour Package 2024: ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10,535గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 5,895, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4555గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 8287932318,7978127004,8287932319 ఫొన్ నెంబర్లను సంప్రదించవ్చు. వెబ్ సైట్ లో మరిన్ని వివరాలను కూడా ఉంచారు.

హైదరాబాద్ టు ఊటీ టూర్…

IRCTC Hyderabad Ooty Package 2024: ఇక ఈ వేసవిలో ఏదైనా చల్లగా ఉండే ప్రాంతానికి వెళ్లి సేద తీరాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం బెస్ట్ ప్లేస్ లను సెర్చ్ చేస్తుంటారు. అందులోనూ తక్కువ ధరలో ఉండే ప్యాకేజీలను చూస్తుంటారు. అయితే ఇలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(Irctc Tourism) రకరకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది. తక్కువ ధరలోనే పలు ప్రాంతాలను చూపించే ప్లాన్ లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా.... తాజాగా ఊటీకి టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ULTIMATE OOTY EX HYDERABAD పేరుతో ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు.ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని 09-APR 2024వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ఉంటుంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

IPL_Entry_Point