IRCTC Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ టూర్ - అతి తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే-irctc tourism shirdi tour package from vijayawada check full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ టూర్ - అతి తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

IRCTC Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ టూర్ - అతి తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 26, 2023 12:25 PM IST

IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. నాలుగు రోజుల ఈ టూర్ ప్యాకేజీలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కు కూడా వెళ్లి రావొచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…..

షిర్డీ టూర్
షిర్డీ టూర్

IRCTC Shirdi Tour From Vijayawada: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ముఖ్యంగా అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే వారికోసం అతి తక్కువ ధరలోనే ఆకర్షించే ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా…. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు రైలు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది.

టూర్ ప్యాకేజీ షెడ్యూల్ :

Day - 1: తొలి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208 - Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day - 2: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

Day - 3 : ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 04 Friday: తెల్లవారుజామున 2.50 విజయవాడ కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు ఇవే:

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15670 ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10050, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8300చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 5840 ధరగా నిర్ణయించారు. ఈ టూర్ ను బుకింగ్ చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను https://www.irctctourism.com  వెబ్ సైట్ లో చూడవచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024