IRCTC Kerala Package : భూతల స్వర్గం కేరళ అందాలు చూసొద్దామా-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ 7 రోజుల టూర్ ప్యాకేజీ
IRCTC Kerala Package : ఐఆర్సీటీసీ విశాఖ నుంచి 7 రోజుల కేరళ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, తేక్కడి , కుమారకోమ్, త్రివేండ్రంలోని టూరిస్ట్ ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. జనవరి 24, 2025 తేదీన ఈ ఎయిర్ ట్యూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.
IRCTC Kerala Package : న్యూ ఇయర్ స్టార్టింగ్ లో ఓ చక్కటి టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే అద్భుతమైన కేరళ అందాలు వీక్షించేందుకు ఐఆర్సీటీసీ విశాఖపట్నం నుంచి ఏడు రోజుల ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. జనవరి 24, 2025న ఈ ఎయిర్ ట్యూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. కేరళలోని కొచ్చి, మున్నార్, తేక్కడి, కుమారకోం, త్రివేండ్రం టూరిస్ట్ ప్రదేశాలను వీక్షించేందుకు విశాఖ నుంచి ప్యాకేజీ అందిస్తు్న్నారు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం ధర రూ.42,890 నుంచి ఉంది.
- టూర్ సర్క్యూట్‌లు : విశాఖపట్నం - కొచ్చి - మున్నార్ - తేక్కడి - కుమారకోమ్ - త్రివేండ్రం
- టూర్ ప్రారంభ తేదీ: 24.01.2025
- బయలుదేరే ప్రదేశం: విశాఖపట్నం ఎయిర్ పోర్టు
ప్రయాణం ఇలా :
డే 01 : (24.01.2025)
విశాఖపట్నం - కొచ్చిన్ విమానాశ్రయం
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. సాయంత్రం 5:15 గంటలకు కొచ్చి విమానాశ్రయానికి టూరిస్టులు చేరుకుంటూరు. కొచ్చిన్ విమానాశ్రయం నుంచి పికప్ చేసి హోటల్‌కి తీసుకెళ్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్, బ్రాడ్‌వే సందర్శిస్తారు. కొచ్చిలోని హోటల్‌లో రాత్రి బస ఉంటుంది.
డే 02 : (25.01.2025)
కొచ్చి నుంచి మున్నార్ (122 కి.మీ)
బ్రేక్ ఫాస్ట్ తర్వాత... కొచ్చి ఫోర్ట్( డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, శాంటా క్రజ్ బాసిలికా) సందర్శన ఉంటుంది. తర్వాత మున్నార్‌కు వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి మున్నార్‌లోనే బస చేస్తారు.
డే 03 : (26.01.2025)
మున్నార్ లో స్థానిక ప్రదేశాల సందర్శన
అల్పాహారం తర్వాత ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శిస్తారు. తరువాత మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండలా డ్యామ్ లేక్ సందర్శించి పునర్జని సాంస్కృతిక గ్రామాన్ని విజిట్ చేస్తారు. మున్నార్‌లోని హోటల్‌లో రాత్రి బస చేస్తారు.
డే 04 : (27.01.2025)
మున్నార్ - తేక్కడి
హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గంలో తేక్కడికి బయలుదేరతారు. తేక్కడికి చేరుకుని హోటల్‌లో చెక్-ఇన్ చేస్తారు. అనంతరం పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం/స్పైస్ ప్లాంటేషన్, సరస్సులో బోటింగ్ ఉంటుంది. రాత్రికి తేక్కడిలోని హోటల్‌లో బస చేస్తారు.
డే 05 : (28.01.2025)
తేక్కడి - కుమరకోమ్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ లో చెక్అవుట్ చేసి కుమరకోమ్‌కి వెళ్తారు. హౌస్‌బోట్ లో చెక్ ఇన్ చేస్తారు. కుమరకోమ్‌లోని హౌస్‌బోట్‌లో రాత్రి బస చేస్తారు.
డే 06 : (29.01.2025)
కుమరకోమ్ నుంచి త్రివేండ్రం/కోవలం వరకు
హౌస్‌బోట్ నుంచి చెక్ అవుట్ చేసి, త్రివేండ్రం/కోవలం వెళ్తారు. మధ్యాహ్నం అజిమల ఆలయం, కోవలం బీచ్ విజిట్ చేస్తారు. రాత్రిపూట త్రివేండ్రంలోని హోటల్‌లో బస చేస్తారు.
డే 07 : (30.01.2025)
స్థానిక ప్రదేశాల సందర్శన, త్రివేండ్రం విమానాశ్రయంలో డ్రాప్ - విశాఖపట్నం
బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. త్రివేండ్రంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. 11:30 గంటలకు త్రివేండ్రం విమానాశ్రయంలో టూరిస్టులను డ్రాప్ చేస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం విమానం ఎక్కుతారు. 2:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో కేరళ టూర్ ముగుస్తుంది.
సంబంధిత కథనం