Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే-irctc tourism operate 3 days vizag retreat tour package from visakhapatnam 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Published May 16, 2024 07:45 PM IST

Simhachalam Arakku Tour 2024: అరకు,సింహాచలం చూసేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి……

వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజీ
వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజీ

IRCTC Simhachalam Arakku Tour :  టూరిజం ప్రదేశాలను చూసేందుకు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూనే ఉంది ఐఆర్‌సీటీసీ టూరిజం. దేశవ్యాప్తంగానూ టూరిస్ట్ ప్లేస్ లను చూసేందుకు తక్కువ ధరలోనే వీటిని ఆపరేట్ చేస్తోంది.

తాజాగా 'వైజాగ్ రీట్రీట్' పేరుతో  మరో ప్యాకేజీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా  విశాఖ, అరకు, సింహాచలానికి వెళ్లి రావొచ్చు. ప్రస్తుతం 21 మే 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 

వైజాగ్ రీట్రీట్ ప్యాకేజీ షెడ్యూల్ - ముఖ్య వివరాలు

  • అరకు,సింహాచలం చూసేందుకు  'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
  • ఈ టూర్ ప్యాకేజీని వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
  • 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
  • ప్రస్తుతం 21 మే 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
  • ఫస్ట్ డే - మార్నింగ్ విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రి వైజాగ్ లోనే ఉంటారు.
  • సెకండ్ డే -  ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరుతారు. ఈ జర్నీచాలా బాగుంటుంది. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. 
  •  మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి.  లంచ్ తర్వాత Submarine Museum ను చూడొచ్చు,
  • టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.
  • వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజీ ధరలు :  కంఫర్ట్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7990, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10980, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19950గా ఉన్నాయి. 
  • 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
  •  https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు

తెలంగాణ టూరిజం అరకు టూర్ ప్యాకేజీ

మరోవైపు అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). రోడ్డు మార్గం ద్వారా…ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.

అరకు టూర్ షెడ్యూల్

  • అరకుకు టూరిజం ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism) . Araku Tour - Telangana Tourism పేరుతో ఆపరేట్ చేస్తుంది.
  • ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 4 రోజులు ఉంటుంది.
  • చూసే ప్రాంతాలు : అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి,
  • బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
  • ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు.
  • నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
  • టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు.

Whats_app_banner