IRCTC Goa Tour : గోవా ట్రిప్... విశాఖ నుంచి 4 రోజుల టూర్ ప్యాకేజీ - వివరాలివే
IRCTC Goa - Visakhapatnam Tour: విశాఖ నుంచి గోవాకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబర్ 20వ తేదీన అందుబాటులో ఉంది.
IRCTC Tourism Goa Tour: గత కొంత కాలంగా అతి తక్కువ ధరలేక టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి చాలా ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా… గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOA DELIGHT EX VISHAKHAPATNAM’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖపట్నం నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 20, 2023 తేదీన అందుబాటులో ఉంది. 4 రాత్రులు 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. టూర్ షెడ్యూల్ చూస్తే….
తొలి రోజు విశాఖపట్నంలో టూర్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2.55 గంటలకు విశాఖలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.55 గంటలకు గోవా చేరుకుంటారు. పర్యాటకుల్ని అక్కడ్నుంచి గోవాలోని ప్యారడైజ్ విలేజ్ బీచ్‌కు తీసుకెళ్తారు. రాత్రికి ఇక్కడే చేస్తారు. రెండో రోజు నార్త్ గోవా టూర్ ఉంటుంది. ఫోర్ట్ ఆగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ సందర్శిస్తారు. పర్యాటకులు సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ కు వెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. 3వ రోజు ఖాళీ సమయం ఉంటుంది. పర్యాటకులు గోవాలో షాపింగ్ చేయవత్తు. మఫ్సా మార్కెట్, పబ్స్‌కి వెళ్లొచ్చు. ఇక నాల్గవ రోజు దక్షిణ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శిస్తారు. మండోవీ నదిపై బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయవచ్చు.
ఐదో రోజు గోవా నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 3.40 గంటలకు గోవాలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 5.35 గంటలకు విశాఖ చేరటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
గోవా టూర్ ధరలు :
సింగిల్ షేరింగ్ కు రూ39,010ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 28,750 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.27,640గా ,ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. టూర్ ప్యాకేజీని బుక్ కూడా చేసుకోవచ్చు.