IRCTC Araku Tour: ఆంధ్రా ఊటీ 'అరకు' ట్రిప్... ఈ ఒక్కరోజు ప్యాకేజీ చూడండి
Visakhapatnam Araku IRCTC Tour: అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన డేట్స్ తో పాటు ధరలను కూడా ప్రకటించింది. ఒక్కరోజులోనే ఈ టూర్ ముగుస్తుంది.
IRCTC Visakhapatnam Araku Tour: వేర్వురు ప్రదేశాలను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ సెప్టెంబర్ 25వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.
Day 01 : ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.
అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.
అరకు టూర్ ధరలు:
Visakhapatnam Araku Tour Cost: ఈ ఒక్క రోజు ప్యాకేజీకి చూస్తే... ఈసీ క్లాస్ లో పెద్దలకు 4,450గా ఉంటే.. పిల్లలకు 4,080గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో పెద్దలకు రూ. 2285గా ఉంది. ఇక ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. వెళ్లే కోచ్ ను బట్టి ధరలు మారుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం