Telugu News  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Araku Valley Tour From Visakhapatnam
విశాఖ - అరకు టూర్
విశాఖ - అరకు టూర్

IRCTC Araku Tour: అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

28 January 2023, 11:04 ISTHT Telugu Desk
28 January 2023, 11:04 IST

IRCTC Arakku Tour: అరకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'వైజాగ్ రీట్రీట్' ప్యాకేజీని అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

IRCTC Tourism Packages: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు సరికొత్త ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇక వీకెండ్‌లో అరకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ఇస్తోంది. 'వైజాగ్ రీట్రీట్' (VIZAG RETREAT)పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అరకుతో పాటు సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 2వ తేదీన అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీలో విశాఖపట్నం, అరకు, సింహాచలం చూస్తారు. షెడ్యూల్ చూస్తే...

Day - 01 మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.

Day - 02 రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు.

Day - 03 మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు...

IRCTC Araku Tour Cost: అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8985, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11835, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.20,380గా నిర్ణయించారు. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

టికెట్ల ధరలు
టికెట్ల ధరలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు