రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే వివిధ సేవలను అందిస్తుంది. అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ సేవలను అందుబాటులో ఉంచింది. ప్రయాణానికి ఒక రోజు ముందు ఈ టికెట్లను విడుదల చేస్తారు. తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ టికెట్ల మధ్య తేడాలు, పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కొన్నిసార్లు చివరి నిమిషంలో ప్రయాణాలకు రైలు టికెట్లు అవసరం పడతాను. అటువంటి పరిస్థితులలో సహాయం చేయడానికి ఐఆర్సీటీసీ తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లును అందుబాటులో ఉంచింది. ఈ రెండూ తక్కువ సమయంలో సీట్లను పొందడంలో సహాయపడతాయి.
సాధారణంగా రైల్వే ప్రయాణమంటే చాలా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. దూర ప్రాంతాలకు రైల్వే ప్రయాణాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందుకే రైల్వే టికెట్లు నిత్యం భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం 60 రోజుల ముందస్తుగా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తత్కాల్ అంటే హిందీ భాషలో "తక్షణం" అని అర్థం. తక్కువ సమయంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ ఈ సేవలు అందిస్తోంది. మరోవైపు, ప్రీమియం తత్కాల్...ఈ సేవలు తత్కాల్ కు కాస్త మెరుగైన వెర్షన్, ఇది అధిక ధరలో అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
మీ దగ్గర్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు లేదా ఐఆర్సీటీసీ వెబ్ సైట్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తత్కాల్ అంటే ప్రీమియం తత్కాల్ టికెట్లు బుకింగ్ కన్ఫర్మేషన్ రేటు ఎక్కువగా ఉంటుంది. కాస్త ధర ఎక్కువైన టికెట్ కచ్చితంగా కావాలి అనుకునేవారు ప్రీమియం తత్కాల్ సేవలు ఉపయోగించుకోవచ్చు.
సంబంధిత కథనం