IRTCTC Jyotirlinga Darshan: విజయవాడ నుంచి ఐఆర్‌‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన్ టూర్ ప్యాకేజీ-irctc sapta jyotirlinga darshan tour package from vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irtctc Jyotirlinga Darshan: విజయవాడ నుంచి ఐఆర్‌‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన్ టూర్ ప్యాకేజీ

IRTCTC Jyotirlinga Darshan: విజయవాడ నుంచి ఐఆర్‌‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన్ టూర్ ప్యాకేజీ

Sarath chandra.B HT Telugu
Aug 12, 2024 12:59 PM IST

IRTCTC Jyotirlinga Darshan: ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను కవర్ చేస్తూ భారత్ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును విజయవాడ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే ఈ రైలు 28వ తేదీన ముగుస్తుంది. యాత్రలో 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

విజయవాడ నుంచి 7 జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శన యాత్ర, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
విజయవాడ నుంచి 7 జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శన యాత్ర, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRTCTC Jyotirlinga Darshan: ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను కవర్ చేస్తూ భారత్ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును విజయవాడ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే ఈ రైలు 28వ తేదీన ముగుస్తుంది. యాత్రలో 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర 11రాత్రులు, 12 పగళ్లు కొనసాగుతుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఈ యాత్ర సాగుతుంది.

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రలో ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఆలయాలు, ద్వారకలో నాగేశ్వర్, సోమనాథ్‌లో సోమనాథ్‌ ఆలయం, పూణేలో భీమశంకర్ ఆలయం, నాసిక్‌లో త్రయంబకేశ్వరాలయం, ఔరంగాబాద్‌లో గ్రిష్ణేశ్వర్ ఆలయ దర్శనాలు ఉంటాయి.

మూడు క్యాటగిరీలలో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర సాగుతుంది. ఇందులో స్లీపర్ క్లాస్ జర్నీలో పిల్లలకు రూ.20,590, 11ఏళ్లలోపు పిల్లలకు రూ.19,255వసూలు చేస్తారు.బడ్జెట్‌ హోటల్ నాన్‌ ఏసీ రూమ్‌లో బస కల్పిస్తారు. అయాప్రాంతాల్లో నాన్‌ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.

స్టాండర్డ్ ప్యాకేజీలో థర్డ్‌ ఏసీలో జర్నీకి ఒక్కొక్కరికి రూ.33,015, పిల్లలకు రూ.31,440 ఛార్జీ చేస్తారు. బడ్జెట్ హోటల్లో ఏసీ రూమ్ ‌లో బస కల్పిస్తారు. లోకల్ ప్రయాణాలకు నాన్‌ ఏసీ వాహనాన్ని సమకూరుస్తారు.

కంఫర్ట్‌ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.43,355వసూలు చేస్తారు. 11ఏళ్లలోపు పిల్లలకు రూ.41,465 వసూలు చేస్తారు. ఏసీ రూమ్‌లో బసతో పాటు ఏసీ వాహనాన్ని లోకల్ జర్నీకి అందుబాటులో ఉంటుంది.

ప్రయాణ సమయంతో పాటు దర్శన సమయాల్లో ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, రాత్రికి శాఖాహార భోజనం సమకూరుస్తారు. ప్రయాణికులకు బీమాతో పాటు ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఐఆర్‌సీటీసీ టూర్‌ మేనేజర్‌లు యాత్ర మొత్తం సహాయంగా ఉంటారు. బుకింగ్‌ కోసం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో లేదా 9281030714, 92814 95848 నంబర్లలో సంప్రదించవచ్చు.

యాత్ర కొనసాగుతుంది ఇలా…

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర రైలు విజయవాడ నుండి ఆగస్టు 17, 2024న ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మహారాష్ట్ర & గుజరాత్‌లోని ప్రాంతాలలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది.

సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, మధిర, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కామారెడ్డి, భువనగిరి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్ నాందేడ్ పూర్ణ మార్గంలో సాగుతుంది. 2024 ఆగస్టు 17 నుండి 28 వరకు 11 రాత్రులు / 12 రోజుల వ్యవధిలో ట్రిప్ సాగుతుంది.

ఆసక్తిగల ప్రయాణీకులు IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. https://www.irctctourism.com/ . విజయవాడలోని IRCTC కార్యాలయం, రైల్వే రిటైరింగ్ రూమ్ దగ్గర, ఫస్ట్‌ ఫ్లోర్‌, విజయవాడ రైల్వే స్టేషన్‌‌లో కూడా సంప్రదించవచ్చు. 9281030714, 9281495848 నంబర్లలో అదనపు వివరాలు లభిస్తాయి.