షిర్డీ సాయి సన్నిధిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ విజయవాడ నుంచి మూడు రాత్రులు/నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్‌లో షిర్డీ, శని శింగనాపూర్ కవర్ చేస్తారు. ప్రతి మంగళవారం ఈ టూర్ మెుదలవుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన ప్యాకేజీ వివరాలు చూద్దాం..
ప్రతి మంగళవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. రూ.5,680 నుంచి ప్యాకేజీలు మెుదలవుతాయి. షిర్డీ, శని శింగనాపూర్‌కు దర్శించుకుని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ చాలా బాగుంటుంది. 3 రాత్రులు, 4 రోజుల్లో సాగే ఈ టూర్‌లో షిర్డీ సాయి నాథుడ్ని దర్శించుకోవచ్చు. ఈ టూర్ జూన్ 24వ తేదీన ఉంది.
ఒకరి నుంచి ముగ్గురు ప్యాసింజర్లకు చూసుకుంటే క్లాస్(కంఫర్ట్ 3AC) -సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 16150, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 10100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8520, పిల్లలకు రూ.7630గా ఉంది. స్టాండర్డ్(SL) -సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 13810, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 7760, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6180, పిల్లలకు రూ. 5290గా నిర్ణయించారు.
నలుగురి నుంచి ఆరుగురి ప్యాసింజర్లకు చూసుకుంటే.. కంఫర్ట్ 3AC ట్విన్ షేరింగ్ ధర రూ.8690, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.8020, పిల్లలకు రూ.7630గా ఉంది. అదే సమయంలో స్టాండర్డ్(ఎస్ఎల్) ట్విన్ షేరింగ్ రూ.6350, ట్రిపుల్ షేరింగ్ రూ.5680, పిల్లలకు రూ.5290గా పెట్టారు.
విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 10:1 గంటలకు షిరిడి సాయి సన్నిధి ఎక్స్‌ప్రెస్ షిర్డీకి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ చేస్తారు.
ఉదయం 06:15 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి షిర్డీలోని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. మీరు సొంతంగా షిర్డీ ఆలయాన్ని సందర్శించవచ్చు. హోటల్ నుంచి నడిచి వెళ్లవచ్చు, దర్శనం టిక్కెట్టు టూర్ ప్యాకేజీలో చేర్చరు. రాత్రి షిర్డీలోనే స్టే ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ అవుతారు. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే.. మళ్లీ షిర్డీ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత శని శింగనాపూర్ బయలుదేరతారు. శనిదేవుని ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం నాగర్‌సోల్‌కు బయలుదేరుతారు. రాత్రి 7:25 గంటలకు రైలు ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ సాయి సన్నిధి ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. https://www.irctctourism.com/ అధికారిక వెబ్‌సైట్ వెళ్లి మీరు పూర్తి వివరాలు చూడవచ్చు.