IRCTC Tour: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర స్పెషల్… ఏప్రిల్‌ 8 నుంచి 19వరకు టూర్‌-irctc bharat gourav special sapt jyotirlinga special train from vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tour: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర స్పెషల్… ఏప్రిల్‌ 8 నుంచి 19వరకు టూర్‌

IRCTC Tour: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర స్పెషల్… ఏప్రిల్‌ 8 నుంచి 19వరకు టూర్‌

Sarath Chandra.B HT Telugu

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైల్లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్ర 12 రోజుల పాటు ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాల మీదుగా సాగుతుంది. ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ సదుపాయం ఉంది.

విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ స‌ప్త జ్యోతిర్లింగ యాత్ర‌

IRCTC Tour: ఐఆర్‌‌సీటీసీ టూరిజం ప్యాకేజీల్లో భాగంగా విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారకా, సోమ్‌నాథ్‌, పూణే, నాసిక్‌, ఔరంగాబాద్‌ మీదుగా 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయం కల్పించారు.

11 రాత్రులు, 12 పగళ్లలో సాగే సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయినిలో మహాకాళేశ్వర్‌, ఓం కారేశ్వర్‌, ద్వారకా, సోమ్‌నాథ్‌, పూణేలో భీమశంకర్‌, నాసిక్‌లో త్రయంబకేశ్వర్‌, ఔరంగాబాద్‌‌లో గ్రిష్‌నేశ్వర్‌ మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు 718మంది పాల్గొనవచ్చు. స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారు.

టూర్‌ ధరలు...

ఎకానమీ విభాగంలో డబుల్‌, ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.20,890, పిల్లలకు రూ19,555 చెల్లించాల్సి ఉంటుంది.స్టాండర్డ్‌ విభాగంలో థర్డ్‌ ఏసీ జర్నీలో పెద్దలకు రూ.33,735, పిల్లలకు రూ.32,160 చెల్లించాలి. కంఫర్ట్‌ విభాగంలో పెద్దలకు రూ.44,375, పిల్లలకు రూ.42,485 చెల్లించాలి. ఒంటరిగా బుకింగ్ చేసుకున్న పర్యాటకులు ఆక్యుపెన్సీని ఇతరులతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణ తేదీ...

ఏప్రిల్ 8వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడలో సప్త జ్యోతిర్లింగ్ యాత్ర మొదలవుతుంది. ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, నాందేడ్, పూర్ణాలలో ప్రయాణికులను బోర్డింగ్ సదుపాయం కల్పిస్తారు.

10వ తేదీ ఉదయం 8గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. యాత్ర 11వ రోజు 18వ తేదీన జ్యోతిర్లింగ యాత్ర ఔరంగాబాద్‌ చేరుతుంది. 19వ తేదీ తెల్లవారు జామున రెండు గంటలకు పూర్ణ చేరుతుంది. అక్కడి నుంచి వరుసగా నాందేడ్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం మీదుగా 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరడంతో యాత్ర ముగుస్తుంది.

ప్రయాణ సమయంలో ఎకనామీ విభాగంలో నాన్‌ ఏసీ గదుల్లో బస కల్పిస్తారు. స్టాండర్డ్, కంఫర్ట్‌ ప్యాకేజీల్లో ఏసీ గదుల్లో బస కల్పిస్తారు.వాష్‌ అండ్ చేంజ్‌ లో భాగంగా ఎకానమీలో నాన్‌ ఏసీ గదుల్లో అవకాశం కల్పిస్తారు. గమ్య స్థానాల్లో ప్రయాణాలకు ఎకానమీ, స్టాండర్డ్ విభాగాల్లో నాన్ ఏసీ వాహనాలు సమకూరుస్తారు. కంఫర్ట్‌ విభాగంలో ఏసీ వాహనాలను సమకూరుస్తారు. ప్రతిరోజు మార్నింగ్ టీ, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్, డిన్నర్‌లలో శాఖాహారాన్ని అందిస్తారు. టూర్‌ వివరాల కోసం ఈ లింకును అనుసరించండి.

సప్ల జ్యోతిర్లింగ యాత్ర బుకింగ్ కోసం 9281495848, 9281030714 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. విజయవాడ రైల్వేస్టేషన్లోని రిటైరింగ్ రూమ్ వద్ద ఉన్న ఐఆర్సీటీసీ కార్యా యలయంలో కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ కోసం ఈ లింకును అనుసరించండి.

యాత్రలో బడ్జెట్ హోటళ్లలో రాత్రిపూట బస ఉంటుందని ఐఆర్‌సీటీసీ అధికారులు వివరించారు. . నాన్ ఏసీ వెహికల్, ఎకానమీ స్టాండర్డ్ ప్రయాణికులకు, ఏసీ వెహికల్ కంఫర్ట్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్లు ప్రయా ణంలో అందుబాటులో ఉంటారు. పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం