IRCTC Visakha Andaman Tour : అండమాన్ సాహస యాత్రకు సిద్ధమా? విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే-irctc announces tour package from visakhapatnam to andaman islands full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Visakha Andaman Tour : అండమాన్ సాహస యాత్రకు సిద్ధమా? విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Visakha Andaman Tour : అండమాన్ సాహస యాత్రకు సిద్ధమా? విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

Bandaru Satyaprasad HT Telugu
Nov 10, 2024 03:26 PM IST

IRCTC Visakha Andaman Tour : అద్భుతమైన అండమాన్ అందాలు ఆస్వాదిస్తారా? బీచ్ లలో వివరిస్తూ పగడపు దీవుల్లో ఎంజాయ్ చేస్తారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ విశాఖ నుంచి ఆరు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తదుపరి టూర్ డిసెంబర్ 5న ప్రారంభం అవుతుంది.

అండమాన్ సాహస యాత్రకు సిద్ధమా? విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే
అండమాన్ సాహస యాత్రకు సిద్ధమా? విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

బంగాళాఖాతంలో అద్భుత దీవుల సముదాయం అండమాన్ ఐలాండ్స్. దాదాపు 300 ద్వీపాలు, తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, అటవీ అందాలు, కోరల్ ఐలాండ్స్ తో అండమాన్ ప్రసిద్ధి. సొరచేపలు, సముద్ర జీవులు, పగడపు దిబ్బలు.. ప్రముఖ డైవింగ్, స్నార్కెలింగ్ సైట్‌లను అండమాన్ ఎంతో ప్రసిద్ధి. పర్యాటకలను ఆకర్షించే అండమాన్ కు విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఆరు రోజుల్లో పోర్ట్ బ్లెయిర్, రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, హ్యావ్లాక్, నీల్ ఐలాండ్ టూరిస్ట్ ప్రదేశాలను కవర్ చేస్తారు. టూర్ ప్యాకేజీ ధర రూ.57,230.

ప్యాకేజీ వివరాలు

  • ప్యాకేజీ పేరు - ఎల్టీసీ స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్
  • ట్రావెలింగ్ మోడ్ - ఫ్లైట్
  • స్టేషన్ - విశాఖపట్నం విమానాశ్రయం
  • క్లాస్ - కంఫర్ట్
  • పర్యటన తేదీలు - 05.12.2024

ప్యాకేజీ టారిఫ్: (ఒక వ్యక్తికి ప్యాకేజీ ధర)

క్లాస్   సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు)చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 సంవత్సరాలు)
కంఫర్ట్రూ. 75115/-రూ. 58860/-రూ. 57230/-రూ. 50270/-రూ. 46810/-

  • టూర్ సర్క్యూట్ : పోర్ట్ బ్లెయిర్, రాస్-నార్త్ బే ఐలాండ్, హావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్, పోర్ట్‌బ్లెయిర్
  • టూర్ వ్యవధి : 05 రాత్రులు/06 రోజులు
  • టూర్ ప్రారంభ తేదీ: 05.12.2024
  • బయలుదేరు ప్రదేశం : విశాఖపట్నం ఎయిర్ పోర్టు

టూర్ సాగేదిలా?

డే 01 - (05.12.2024) విశాఖపట్నం -పోర్ట్ బ్లెయిర్

విశాఖపట్నం నుంచి ఉదయం 08:35 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1:00 గంటకు పోర్ట్ బ్లెయిర్ చేరుకోరుతుంటారు టూరిస్టులు. హోటల్‌కు వెళ్లారు. హోటల్‌కి చెక్-ఇన్ చేసి...మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ విజిటింగ్ ఉంటుంది. తర్వాత సెల్యులార్ జైలులో లైట్ & సౌండ్ షోను ఆస్వాదిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు.

డే 02 - (06.12.2024) -పోర్ట్ బ్లెయిర్

బ్రేక్ ఫాస్ట్ తర్వాత రాస్ ఐలాండ్, నార్త్ బే సందర్శిస్తారు. భోజనం తర్వాత సముద్రిక (నేవల్ మెరైన్ మ్యూజియం) వీక్షిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.

డే 03 : (07.12.2024)- పోర్ట్ బ్లెయిర్ -హేవ్‌లాక్ ద్వీపం

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి హావ్‌లాక్ ద్వీపానికి విహారయాత్రకు వెళ్తారు. అక్కడ హోటల్ లో చెక్ ఇన్ చేసి సాయంత్రం రాధానగర్ బీచ్ కు వెళ్లారు. హావ్‌లాక్ ద్వీపంలోనే రాత్రి బస ఉంటుంది.

డే 04 : (08.12.2024) హేవ్‌లాక్ ద్వీపం- నీల్ ఐలాండ్

హోటల్ నుంచి చెక్ అవుట్ చేయండి. కాలాపత్తర్ బీచ్ ను విజిట్ చేస్తారు. నీల్ ఐలాండ్ వెళ్లేందుకు ప్రీమియం క్రూయిజ్ ఆస్వాదించండి. ఆ తర్వాత హోటల్‌ లో చెక్-ఇన్ చేస్తారు. రిఫ్రెష్మెంట్ తర్వాత, నేచురల్ బ్రిడ్జ్, లక్ష్మణపూర్ బీచ్ ను సందర్శిస్తారు. నీల్ ఐలాండ్ లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 05 : (09.12.2024) - నీల్ ఐలాండ్-పోర్ట్ బ్లెయిర్

ఉదయాన్నే భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదించండి. బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరతారు. స్థానికంగా షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేస్తారు.

డే 06 : (10.12.2024) పోర్ట్ బ్లెయిర్ - విశాఖపట్నం

హోటల్ నుంచి చెక్అవుట్ చేసి ఉదయం 07:25 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానాన్ని బోర్డింగ్ ఉంటుంది. ఉదయం 11:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం